స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసిన సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. ప్రభుత్వ సహకారంతో వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ నిర్మిస్తున్న స్టీల్‌ప్లాంట్‌కు సీఎం వైయస్‌ జగన్‌ భూమిపూజ చేశారు. అనంతరం ప్లాంట్‌ నిర్మాణ నమూనాను పరిశీలించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్, మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్‌ భాషా, గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. 
 

Back to Top