మహానేతకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

గుంటూరు: వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ఆసరా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన సీఎం వైయస్‌ జగన్‌ ముందుగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 

Read Also: నేటి నుంచి వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా

Back to Top