రాజ్యాంగ నిర్మాత‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

తాడేప‌ల్లి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూల‌మాల వేసి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు పాల్గొన్నారు.

Back to Top