గాంధీజీ, లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రిల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న‌ నివాళి

తాడేప‌ల్లి: జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘ‌న నివాళులర్పించారు. గాంధీజీ జ‌యంతి సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ నివాసంలో మ‌హాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

మ‌హ‌నీయుల‌కు నివాళుల‌ర్పిస్తూ సీఎం ట్వీట్‌..
జాతిపిత మ‌హాత్మా గాంధీ, మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హదూర్ శాస్త్రి జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుల‌కు నివాళుల‌ర్పిస్తూ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ట్వీట్ చేశారు. `మ‌న‌దేశానికి చెందిన ఇద్ద‌రు గొప్ప వ్య‌క్తులు జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారు అందించిన సేవ‌ల‌ను స్మరించుకుంటున్నాను. సమాజ మేలు కోసం వారి ఆదర్శాలు, ఆలోచనలు మన దేశం పురోగతికి వేసే ప్రతి అడుగులో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తాయి` అని సీఎం ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top