మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం వైయస్‌ జగన్‌

గుడివాడ: మహాశివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివరాత్రి మహోత్సవాలకు హాజరైన సీఎం వైయస్‌ జగన్‌.. శివలింగాన్ని అభిషేకించారు. మహాశివుడికి నమస్కరించి మహాశివలింగానికి పూలమాల, రుధ్రాక్ష మాల సమర్పించి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. వేద పండితులు ఆశీర్వచనం స్వీకరించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బాలశౌరి ఉన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top