లాంచీ ప్రమాదంపై విచారణకు ఆదేశం

మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలి

45 రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ప్రత్యేక కమిటీని ఆదేశించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

రాజమండ్రి: లాంచీ ప్రమాద ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ విచారణకు ఆదేశించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన సీఎం వైయస్‌ జగన్‌ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. లాంచీ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వైయస్‌ జగన్‌ వరద సమయంలో గోదావరిలోకి లాంచీ అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో రెవెన్యూ చీఫ్‌ సెక్రటరీ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, లాండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీలను సభ్యులుగా చేర్చారు. మూడు వారాల్లో ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని, 45 రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top