బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం వైయ‌స్ జగన్‌ సంతాపం

తాడేపల్లి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. బొజ్జల కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనారోగ్యం కారణంగా బొజ్జల.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు.  

Back to Top