పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క అంగుళం కూడా ఎత్తు త‌గ్గించం

అసెంబ్లీలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వైయ‌స్ఆర్ హ‌యాంలో కుడి ప్ర‌ధాన కాల్వ‌కు 10,627 ఎక‌రాల‌ను భూసేక‌ర‌ణ  

చంద్ర‌బాబు హ‌యాంలో కేవ‌లం 14 శాతం ప‌నులు మాత్ర‌మే జ‌రిగాయి

ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టుల ఎత్తు పెంచుతున్నా బాబు ప‌ట్టించుకోలేదు

పోల‌వ‌రాన్ని ఏటీఎంలా మార్చేశార‌ని సాక్షాత్తూ ప్ర‌ధాని మోదీ చెప్పారు

 రివ‌ర్స్ టెండ‌రింగ్ చేస్తే రూ.1343 కోట్లు ఆదా అయ్యాయి

పోల‌వ‌రం నిర్మాణంలో ఆర్ అండ్ ఆర్ పైన ప్ర‌త్యేక దృష్టి పెడ‌తాం

వైయ‌స్ఆర్ ఆశ‌ల‌కు అనుగుణంగా 45.72 మీట‌ర్ల ఎత్తు క‌చ్చితంగా నిర్మిస్తాం

పోల‌వ‌రం వ‌ద్ద వంద అడుగుల వైయ‌స్ఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తాం

అమ‌రావ‌తి:  పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క అంగుళం కూడా ఎత్తు త‌గ్గించ‌మ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉద్ఘాటించారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌ల‌కు అనుగుణంగా 45.72 మీట‌ర్ల ఎత్తు క‌చ్చితంగా నిర్మిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న(1995-2004) సమయంలో పోలవరం గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. ఎగువున ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టుల ఎత్తును పెంచుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని ధ్వ‌జ‌మెత్తారు. శాసనసభ శీతాకాల సమావేశల్లో భాగంగా బుధవారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టుపై స‌భ్యుల‌కు స‌వివ‌రంగా వివ‌రించారు. ముఖ్య‌మంత్రి ఏమ‌న్నారంటే..

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఒక వరం. 2004లో దివంగత నేత వైయ‌స్సార్‌ సీఎం అయిన తర్వాతే పోలవరం కుడి ప్రధాన కాల్వకు 10,327 ఎకరాలకు భూసేకరణ చేశారు. వైయ‌స్సార్‌ హయాంలో 86 శాతం కుటి ప్రధాన కాల్వ పనులు జరిగితే.. చంద్రబాబు హయాంలో కేవలం 14శాతం పనులు మాత్రమే జరిగాయి.  గ‌తంలో ఎంద‌రో ముఖ్య‌మంత్రులు అయ్యారు. ఏ ఒక్క‌రూ కూడా ఆ ప్రాజెక్టు ప‌నులు చేయించాల‌ని అడుగులు వేయ‌లేదు. చంద్ర‌బాబు 1995 నుంచి 2004 వ‌ర‌కు సీఎంగా ఉన్నారు. కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్నాన‌ని చెప్పుకునే వారు. అలాంటి పెద్ద మ‌నిషి పోల‌వ‌రంపై ఏనాడు ఆలోచ‌న చేయ‌లేదు. పక్క‌నే ఉన్న క‌ర్ణాట‌క ఆల్మ‌ట్టి ఎత్తు పెంచినా కూడా ప‌ట్టించుకోలేదు. 

అలాంటి ప‌రిస్థితిలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో 2004లో పోల‌వ‌రం ప్రాజెక్టుకు 10,627 ఎక‌రాలు కుడి మెయిన్ కాల్వ‌కు సంబంధించి 86 శాతం భూమిని సేక‌రించారు. రైట్ మెయిన్ కెనాల్ ప‌నులు చేప‌ట్టారు. 2014లో చంద్ర‌బాబు సీఎం అయ్యాక పోల‌వ‌రం రైట్ కెనాల్‌కు 1700 ఎక‌రాలు అంటే 14 శాతం సేక‌రించారు.  గ‌తంలో ఈయ‌నే కోర్టులో కేసులు వేయించి అడ్డుకు. వైయ‌స్ఆర్ హ‌యాంలో 86 శాతం రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేశారు. లెప్ట్ మెయిన్ కేనాల్‌లో 98 శాతం భూసేక‌ర‌ణ చేయించారు. 

చంద్ర‌బాబు హ‌యాంలో 0.89 శాతం భూ సేక‌ర‌ణ చేయించారు. ఒక ప్రాజెక్టు గురించి సిన్సియ‌ర్‌గా క‌ష్ట‌ప‌డ్డార‌న్న‌ది తెలుసుకోవ‌డం ముఖ్యం. వైయ‌స్ఆర్ మామూలు ముఖ్య‌మంత్రి కాదు..పోల‌వ‌రానికి సంబంధించి అన్ని అనుమ‌తులు తెచ్చారు. సైట్ క్లియ‌రెన్స్‌, క‌లుష్యం, వైల్ద్ లైఫ్ సెంచ‌రీ, ఇండ‌స్ట్రీ క్లియ‌రెన్స్‌, ఫారెస్టు క్లియ‌రెన్స్‌కు నాలుగేళ్ల ప్ర‌క్రియ పూర్తి చేశారు. అన్ని క్లియ‌రెన్స్‌లు వ‌చ్చిన త‌రువాత నిర్మాణ ప‌నులు ప్రారంభించేందుకు కూడా అనుమ‌తులు తెచ్చారు. చిత్త‌శుద్ధితో భూ సేక‌ర‌ణ చేప‌ట్టారు. లెప్ట్‌, రైట్ మెయిన్ కెనాల్ పురోగ‌తి వైయ‌స్ఆర్ హ‌యాంలో జ‌రిగితే ..చంద్ర‌బాబు ప‌ట్టిసీమ పేరుతో క్రెడిట్ కొట్టాల‌ని చూశారు.

 వైయ‌స్ఆర్ రైట్ కెనాల్ నిర్మించ‌క‌పోతే ఆ ప‌ట్టిసీమ‌కు నీరు ఎలా తెచ్చేవారు.  ఆర్ అండ్ ఆర్ వ‌ర్క్‌, భూ సేకర‌ణ‌,  హెడ్ వ‌ర్క్ మొత్తం కూడా 20.61 శాతం 2014 కంటే ముందు పూర్తి అయ్యాయి. చంద్ర‌బాబు సీఎం అయ్యాక హెడ్ వ‌ర్క్‌, లెప్ట్‌, రైట్ మెయిన్ కెనాల్‌, ఫిజిక‌ల్ వ‌ర్క్ అన్ని క‌లిపితే 39.53 శాతం. అంటే చంద్ర‌బాబు హ‌యాంలో మొత్తంగా 20 శాతం మాత్ర‌మే. 9.29 శాతం గ‌తంలో అయితే..20 శాతం చంద్ర‌బాబు హ‌యాంలో పూర్తి అయితే..29.29 శాతం మాత్ర‌మే మేం అధికారంలోకి వ‌చ్చే నాటికి పూర్తిఅయ్యింది. మే 2019 దాకా 61 శాతం అయ్యింది. మిగిలింది ఆ దివంగ‌త నేత వైయ‌స్ఆర్ కుమారుడు వైయ‌స్ జ‌గ‌న్ పూర్తి చేస్తున్నారు.

చంద్ర‌బాబు హ‌యాంలో ప్రాజెక్టులో విప‌రీతంగా అవినీతి జ‌రిగింది. ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పోల‌వ‌రాన్ని చంద్ర‌బాబు ఏటీఎంగా మార్చుకున్నార‌ని బ‌హిరంగంగా చెప్పారు. ఇదే పోల‌వ‌రం ప్రాజెక్టులో రివ‌ర్స్ టెండ‌రింగ్ చేస్తే రూ.1343 కోట్లు ఆదా అయ్యింది.  ఇదీ చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన అవినీతికి నిద‌ర్శ‌నం.

పోల‌వ‌రం ప్రాజెక్టులో ఏం జ‌రిగింది..ఎక్క‌డ త‌ప్పిదం జ‌రిగింద‌ని గ‌మ‌నిస్తే..7, సెప్టెంబ‌ర్‌, 2016లో ప్ర‌త్యేక ప్యాకేజీ అంటూ అప్ప‌టి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అర్థ‌రాత్రి మీడియా స‌మావేశంలో ప్ర‌క‌టించారు. అదే రోజు రాత్రి చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టి ప్ర‌త్యేక ప్యాకేజీని స్వాగ‌తించారు. ఆ రాత్రి  త‌రువాత మ‌రుస‌టి రోజు పొద్దున కేంద్రం ఓ నోట్ విడుద‌ల చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగుతుంది కాబ‌ట్టి మేం ఇస్తున్నామ‌ని కేంద్రం చెప్పింది. ఇరిగేష‌న్ కాంపోనెంట్ ఫ్రం ది దేట్ అని స్ప‌ష్టంగా రాసినా కూడా..చంద్ర‌బాబుకు ఏం అర్థ‌మైందో తెలియ‌దు కానీ..ఢిల్లీ వెళ్లి అరుణ్ జైట్లీకి శాలువ క‌ప్పి స‌న్మానించారు. 

ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల‌ని మామూలుగా రాష్ట్రాలు అడుగుతారు. కానీ చంద్ర‌బాబు మాత్రం అదే నెల 30వ తేదీ ఆఫీస్ మొమోరాండం మినిస్ట్రి ఆఫ్ ఫైనాన్స్‌కు ఇచ్చారు. ఇందులో కూడా 2014కు సంబంధించి ఎంత ధ‌ర చెప్పారో అంతే ఇస్తామ‌ని చెప్పారు. ఆ త‌రువాత గ‌మ‌నిస్తే 2017, 15 మార్చి లో కేంద్ర కేబినెట్‌లో ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ కేబినెట్‌లో టీడీపీకి చెందిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు మంత్రిగా ఉన్నారు. సుజ‌నా చౌద‌రి కూడా ఉన్నారు. ఆ కేబినెట్ అయిపోయిన త‌రువాత ప్రెస్‌మీట్ విడుద‌ల చేశారు. ఇందులో కూడా పోల‌వ‌రం ప్రాజెక్టుకు 1.04.2014 నాటి ఎంత ధ‌ర ఉందో అంతే కేంద్రం ఇస్తుంద‌ని చెప్పారు. ఆ త‌రువాత రాష్ట్రంలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. 

ఆ రోజు నేను ఏం మాట్లాడానో ఒక్క‌సారి వినాల్సిన అవ‌స‌రం ఉంది. అరుణ్ జైట్లీ మొట్ట మొద‌టి రోజు ఏం చెప్పారో..దాన్ని వ‌ల్ల ఏ ర‌కంగా రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుందో..మీరే ఎలా ఒప్పుకుంటారో..నోటిఫికేష‌న్ యాక్ట్‌ను ఎలా ఒప్పుకున్నార‌ని, రూ.16 వేల కోట్ల‌తో ఎలా పోల‌వ‌రాన్ని ఎలా పూర్తి చేస్తార‌ని ప్ర‌శ్నిస్తే ..ఆ రోజు స్పీక‌ర్ మ‌మ్మ‌ల్ని అడ్డుకున్నారు. మైక్ క‌ట్ చేశారు. మొద‌టి సారి ప్యాకేజ్‌లో కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వానికి, జ‌ల‌‌శ‌క్తి డిపార్టుమెంట్‌కు ఓ లేఖ రాసింది. 08 మే 2017లో కేంద్రం నుంచి లేఖ వ‌చ్చినా ముఖ్య‌మంత్రిగా ఎలాంటి స్పంద‌న లేదు. 2018  జ‌న‌వ‌రి 12న చంద్ర‌బాబు కేంద్రానికి ఓ లేఖ రాశారు.అస‌లు చంద్ర‌బాబుకు ఇంగ్లీష్ వ‌స్తుందా?  రాదా?  బుర్ర ఉందా?  లేదా అనుమానం క‌లుగుతుంది. అర్లీ అప్రూవ‌ల్ రివ‌ర్స్ కాస్ట్ అని లేఖ‌లో పేర్కొన్నారు.

ప్రాజెక్టుల విష‌యంలో రేట్లు అన్న‌వి ఫిక్స్‌గా ఉండ‌వు. ఎందుకంటే..భూ సేక‌ర‌ణ‌, పున‌రావాసం 2013 ప్ర‌కారం ఎల్ఏ చ‌ట్టం ప్ర‌కారం ఇంత‌వ‌ర‌కు ఇవ్వ‌లేదు. ఈ చ‌ట్టం ప్ర‌కారం ఒక్క ఏడాది మాత్ర‌మే వాల్యుడిటీ ఉంటుంది. ఏ ర‌కంగా రేట్లు మార‌కుండా ఉంటాయి. జాతీయ ప్రాజెక్టు గైడ్‌లైన్స్ ప్ర‌తి మూడేళ్ల‌కు ఒక్క‌సారి మారుతుంటాయి. ఇలాంటి ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ఏ ర‌కంగా ఒప్పుకున్నార‌న్న‌ది ఆశ్చ‌ర్యంగా ఉంది. 

ఇటువంటి ప‌రిస్థితిలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి మేం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మార్చుతూ అడుగులు వేస్తున్నాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే కేవ‌లం భూ సేక‌ర‌ణ‌, పున‌రావాసానికి రూ.26,585 కోట్లు అవ‌స‌రం అవుతాయి. సివిల్ వ‌ర్స్‌కు రూ.7174 కోట్లు, ప‌వ‌ర్ వ‌ర్క్‌కు 4124 కోట్లు, మొత్తానికి రూ.37885 కోట్లు కావాలి. ఈ ఖ‌ర్చులు గ‌మ‌నిస్తే..2013-2014 రేట్ల ప్ర‌కారం చూస్తే రూజ‌30,610 కోట్లు..ఇందులో రూ.17 వేల కోట్లు తీసేస్తే..మ‌రో రూ.13 వేల కోట్లు అవుతుంది. భూసేక‌ర‌ణ‌, పున‌రావాసం క‌ల్పించాల్సి ఉంది. ఏర‌కంగా ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఇందుకోసం మేం ఒక‌టికి రెండు సార్లు ప్ర‌ధాని, కేంద్ర మంత్రుల‌ను క‌లిశాం. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని నాలుగు సార్లు ఢిల్లీకి పంపించి మంత్రుల‌తో మాట్లాడించాం. అధికారులు కూడా వెళ్లి కేంద్రానికి వివ‌రించారు.

 చంద్ర‌బాబు ఎందుకు ఒప్పుకున్నారో తెలియ‌దు..కేంద్రాన్ని ఒప్పించి, పోల‌వ‌రం అథారిటీకి మీరే లెక్క‌లు క‌ట్టి కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రికి వివ‌రించాల‌ని కోరాం. ఇవ‌న్నీ క్లియ‌ర్ చేస్తూ కేంద్రాన్ని ఒప్పించాం. ఆర్థిక శాఖ కూడా సానుకూలంగా ఉంది. జ‌ల‌శ‌క్తి శాఖ కూడా పాజిటివ్‌గా స్పందించింది. ఆ త‌రువాత కేబినెట్‌లో చ‌ర్చించి పెంచిన ధ‌ర‌ల‌తో నిధులు విడుద‌ల చేస్తార‌ని ఆశిస్తున్నాం. చంద్ర‌బాబు చేసిన పెంట‌ను పూర్తిగా క్లీన్ చేస్తూ అంద‌రితో మాట్లాడి ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేస్తున్నాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. 

ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప్రాజెక్టు ఒక్క అంగుళం కూడా ఎత్తు త‌గ్గించ‌మ‌ని చెబుతున్నాను. నేను దివంగ‌త మ‌హానేత కుమారుడిని , మ‌హానేత ఊహించిన‌ట్లుగా 45.72 మీట‌ర్లు క‌చ్చితంగా క‌డుతామ‌ని, అంగుళం కూడా త‌గ్గించం. ఈ ప్రాజెక్టును ఖ‌రీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే ప‌రిస్థితికి తీసుకువ‌స్తాం. చిత్రావ‌తి ప్రాజెక్టు 10 టీఎంసీల కేపాసిటి. ఏ రోజు కూడా చంద్ర‌బాబు 3 టీఎంసీల‌కు మించి నిల్వ చేయ‌లేదు. గ‌ట్టిగా అడిగితే..అక్ష‌రాల రూ.240 కోట్ల‌కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ డ‌బ్బులు ఇవ్వ‌లేదు. నిల్వ చేసే సామ‌ర్ధం క‌ట్టి కేవ‌లం 3 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టులు క‌ట్టిన త‌రువాత ప‌రిహారం ఇవ్వ‌క‌పోతే ఎలా నీరు నిల్వ చేస్తాం. మేం వ‌చ్చిన త‌రువాత ఆర్ అండ్ ఆర్ ఇచ్చాం. ఈ రోజు ప్రాజెక్టు నిండుకుండాల క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఈ రోజు గండికోట‌లో 19 టీఎంసీలు నిల్వ ఉంది.  

యుద్ధ ప్రాతిపాదిక‌న ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతాయి. ఆర్ అండ్ ఆర్ పై కూడా స‌మానంగా ప్రాధాన్య‌త ఇస్తున్నాం. 41.15 మీట‌ర్ల‌కు నీరు నిల్వ ఉంచాలంటే రూ.3383 కోట్లు ఎల్ఏ ఆర్ అండ్ ఆర్‌కు ఖ‌ర్చు అవుతుంది. అది కూడా చెల్లిస్తాం.  పోల‌వ‌రంలో 194 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవ‌చ్చు. 41.15 మీట‌ర్ల వ‌ద్ద 120 టీఎంసీలు నిల్వ చేసుకోవ‌చ్చు. 44 మీట‌ర్ల దాకా కూడా నీరు నిల్వ చేసుకోవ‌చ్చు. ఇందుకు మ‌రో రూ.2000 కోట్లు ఖ‌ర్చు అవుతుంది. దీని వ‌ల్ల 164 టీఎంసీల నీరు ఉంటుంది. 194 టీఎంసీలు రావాలంటే రూ.13699 కోట్లు ఆర్ అండ్ ఆర్ కింద ఖ‌ర్చు అవుతుంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప్రాజెక్టు ఆప‌కూడ‌దు. అంగుళం కూడా త‌గ్గించ‌కుండా చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తున్నాం. ప్రోటోకాల్ ప్ర‌కారం డ్యాం సెక్యూరిటీ, స్టేబులిటీ కోసం కొన్ని డైడ్ లైన్స్ ఉంటాయి.

 సీడ‌బ్ల్యూసీ ప్రోటోకాల్ ప్ర‌కారం డ్యాం క‌ట్టిన త‌రువాత మొద‌టి సంవ‌త్స‌రం 33 శాతం నీరు నింపాలి. రెండో ఏడా 50 శాతం, మూడో ఏటా వంద శాతం నీరు నింప‌వ‌చ్చు అన్నది నిబంధ‌నలు ఉంటాయి. ఈ స‌మ‌యంలో ఏదైనా లీకులు ఉంటే మ‌ర‌మ్మ‌తులు చేసుకోవ‌చ్చు.  రిజ‌ర్వాయ‌ర్ ఎత్తు ఒక్క సెంటీ మీట‌ర్ కూడా త‌గ్గించ‌మ‌ని ప‌దేప‌దే చెప్పాల్సి వ‌చ్చింది. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఏం జ‌రుగుతుందో మూడు అంశాల‌పై స‌రైన అవ‌గాహ‌న స‌భ్యుల‌కు క‌లిగించాన‌ని భావిస్తున్నాను. దేవుడి ద‌య వ‌ల్ల ఈ ప్రాజెక్టు క‌చ్చితంగా పూర్తి చేస్తాం. 

మా ఎమ్మెల్యేల తీర్మానించిన‌ట్లుగా వంద అడుగుల వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని పోల‌వ‌రం వ‌ద్ద నెల‌కొల్పుతామ‌ని అసెంబ్లీలో చెబుతున్నాను. గ‌తంలో ఇదే పోల‌వ‌రం ప్రాజెక్టు మీద అఅన‌వ‌స‌ర ఖ‌ర్చులు ఏ స్థాయిలో పెట్టారో అన్న‌ది కూడా తెలుసుకోవాలి. చంద్ర‌బాబు హ‌యాంలో పోల‌వ‌రం ప‌ర్య‌ట‌నకు రూ.1 83.45 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఫుడ్ బిల్లు రూ.14 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు బిల్లులు స్వాహా చేశారు. డ‌యాఫ్రం వాల్‌, స్పిల్‌వే శంకుస్థాప‌న అంటూ ఖ‌ర్చులు చేశారు. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేయ‌లేదు. చివ‌రిగా పోల‌వ‌రం వ‌ద్ద మ‌హిళ‌లు పాడిన జ‌యం జ‌యం చంద్ర‌న్న అనే పాట‌ను స‌భ‌లో చూపించారు. ఇందుకోసం రూ.83.45 కోట్లు చంద్ర‌బాబు ఖ‌ర్చు చేశార‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి స‌భ్యుల‌కు వివ‌రించారు. 

తాజా వీడియోలు

Back to Top