నేను ఇంగ్లిష్‌ను వ్య‌తిరేకించిన‌ట్టు బాబు నిరూపించ‌గ‌ల‌రా

- ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

చంద్ర‌బాబు ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెడ‌తానంటే నేను వ్య‌తిరేకించిన‌ట్టు నిరూపించాలి. ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేస్తే స‌హించేది లేదు. అయిదేళ్లు అధికారంలో ఉండి స్కూళ్ల‌ను మార్చే అవ‌కాశం వ‌స్తే చేయ‌లేక ఇప్పుడు మేము చేస్తుంటే వ‌క్ర‌భాష్యాలు చెబుతున్నారు. నారాయ‌ణ‌, చైత‌న్య‌ స్కూళ్ల కోసం మొత్తం విద్యావ్య‌వ‌స్థ‌నే భ్ర‌ష్టు ప‌ట్టించిన చంద్ర‌బాబుకు మాట్లాడే నైతిక హ‌క్కు లేదు. ఇంగ్లిష్ మీడియం నేనే పెట్టాల‌ని చూశాన‌ని చెప్పుకుంటున్న బాబు.. అయిదేళ్లు ఏం చేసిన‌ట్టు.  ప‌త్రికల్లో వ‌చ్చిన ప్ర‌తి క‌థ‌నాల‌ని  మాకు అంట‌గ‌ట్టాల‌ని చూస్తే ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించం. టీడీపీకి పాంప్లెట్ పేప‌ర్ ఈనాడులో రాసిన క‌థ‌నాలు ఇక్క‌డ నేను ప్ర‌దర్శిస్తే చంద్ర‌బాబుకు ఎలా ఉంటుంది. 
 

Read Also: సీఎం నిర్ణయాలు రాష్ట్ర చరిత్రను ఉన్నతస్థాయిలో నిలబెడతాయి

Back to Top