మార్పు గ్రామస్థాయి నుంచి రావాలి

ప్రభుత్వ పథకాల్లో కులమతాలు చూడొద్దు

అవినీతిని ఎట్టి పరిస్థితులత్లో ప్రభుత్వం సమర్థించదు

మన పనితీరు ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారు

ప్రజావేదిక అక్రమ కట్టడం

ప్రతీ సోమవారం  గ్రీవెన్స్‌ డే 

ఎమ్మెల్యేలు అవినీతి,అక్రమాలకు దూరంగా ఉండాలి.

కలెక్టర్ల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి: ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ ప్రణాళికను వివరించారు. పాలకులం కాదు..ప్రజలకు సేవకులం అని ప్రతి క్షణం గుర్తుండాలని సూచించారు. ప్రతి కలెక్టర్,సెక్రటరీ,మంత్రి దగ్గర  మేనిఫెస్టో కాపీ ఉండాలన్నారు. మేనిఫెస్టో అనే పదానికి అర్థం కూడా తెలియని పరిస్థితుల్లో పరిపాలన సాగుతున్న పరిస్థితుల్లో మార్పు రావాలి. మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత,ఖురాన్,బైబిల్‌గా భావించాలి. మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మకంతో ఓట్లు వేశారు. ఇవాళ మన ప్రభుత్వంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం.మీ పదవుల్లో కూర్చోవడానికి నా ద్వారా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు.అందరూ కలిసికట్టుగా  పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలకు మనం దగ్గరవుతాం.రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 151 ఎమ్మెల్యేలు,22 ఎంపీలను ప్రజలు మనకు ఇచ్చారు. 50 శాతం ఓట్ల శాతం  రావడం చరిత్ర. ప్రజలను ఎప్పడూ కూడా మనం మరిచిపోకూడదు.చ్రరితలో ఎన్నడూ లేని విజయం ప్రజలు అందించారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం పూర్తిచేయాలి. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రతి అంశం చేశామని ఓట్లు అడగాలి.

ప్రజాస్వామ్యంలో మనం ఉన్నవనే సంగతి ఎవరూ మరిచిపోకూడదు.ఎమ్మెల్యేలు,ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ముఖంలో చిరునవ్వు ఉండాలి.2 లక్షల మంది ఓటు వేస్తే వారు ఎమ్మెల్యేలు అయిరన్న సంగతి మరిచిపోకూడదు. ఎమ్మెల్యేలు అవీనితి,దోచుకోవడం చేస్తే ఎంతటి పెద్దవారయిన గాని, ఏస్థాయిలో ఉన్న వారినైనా చర్యలు తీసుకుంటాం.ఎమ్మెల్యేలు అవినీతి,అక్రమాలకు దూరంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే రెండో కన్ను అధికారులు. ఇద్దరు ఒక్కటయితే ప్రజలకు మేలు జరుగుతుంది. రైతు,పేద,అట్టడుగు వర్గాలను మరిచిపోకూడదు.శాచునేషన్‌ పద్దతిలో ప్రతి అర్హుడికి అందాలి.వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి.  అణగారిన వర్గాలు ఆర్థికంగాఎదగాలి. మేనిఫెస్టోలో ప్రతి అంశం కూడా పేద,రైతు,అణగారిన వర్గాలకు అందాలి. వారు బాగుపడాలి.

కులం,మతం,ప్రాంతం,రాజకీయాలు,పార్టీలు  చూడకుండా ప్రతి ఒకరికి నవరత్నాలు చేరాలి.మనకు ఓట్లు వేయని వారికి కూడా అర్హత ఉంటే వారికి సంక్షేమం అందాలి.ఎన్నికలయ్యేదాకే రాజకీయాలు,ఎన్నికల అయినతర్వాత అందరూ మనవాళ్లే.శాచునేషన్‌ పద్దతిలో వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం గ్రామ వాల్లంటీర్లు,సెక్రటరీలను తీసుకురావడం జరిగిందన్నారు.ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్‌ను నియమించడం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసాం.ప్రతి ప్రభుత్వ పథకం డోర్‌ డెలివరీ చేస్తాం. గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్పడకూడదు. ప్రభుత్వం యంత్రాంగం నిజాయతీగా పనిచేయాలి. గ్రామస్థాయి నుంచి పైస్థాయి దాకా అనినీతి ఉండకూడదు. పారదర్శక ప్రతి అడుగులో కనిపించాలి. చెడు పోయిన వ్యవస్థ మారాలని చెప్పి ఎన్నికల సమయంలో ప్రతి సభలోనూ మాట్లాడాను.అవినీతి అనేది ఎక్కడ ఉండకూడదు.

దేశ మొత్తం మన వైపు చూడాలి.ఇంత బాగా పనిచేస్తుందని మిగిలిన చోట్ల అనుసరించాలి.ప్రజల హక్కుగా అందించాల్సిన సేవలకు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి రాకూడదు. ప్రజలు ఆఫీసులు చుట్టూ చెప్పులు ఆరిగిపోయేవిధంగా తిరిగే పరిస్థితి రాకూడదు.మన ప్రభుత్వంలో మనం అధికారంలోకి ఉండగా ప్రజలకు ఏమి కావాలన్న కూడా వారు లంచాలు ఇచ్చే పరిస్థితి నుంచి బయటకురావాలి.వారు ఆఫీసులు చుట్టూ చెప్పుడు అరిగే పరిస్థితి రాకూడదు.ఏపీలో ఇసుక మాఫియా ఉండకూడదు.పేకాట క్లబ్బులను ప్రోత్సహించొద్దు.గ్రామస్థాయి నుంచి మార్పు తీసుకురావాలి.కాంట్రాక్టర్లకు అంటేనే అవినీతి అనే పరిస్థితికి తీసుకొచ్చారు.ఇరిగేషన్,రోడ్లు, సచివాలయ నిర్మాణాలు ప్రతి చోట అవీనీతి జరిగింది. పార్శదర్శకంగా మార్పుకోసం పైస్థాయి నుంచి మొదలు పెట్టాం.ఎక్కడా తప్పు జరిగిందనేది గుర్తించాం.

గత ప్రభుత్వ అవినీతికి మచ్చు తునక ఈ ప్రజావేదిక.ఈ అక్రమ నిర్మాణంలో కూర్చోని సమీక్ష జరుపుతున్నాం.ప్రజావేదికను కూల్చేయమని అధికారులకు ఆదేశాలిస్తున్నాం.ప్రజావేదికతోనే అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభమవుతాయి.ఇదే ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం.ఓ సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అక్రమ నిర్మాణాలు కడితే కిందన్న వాళ్లు అక్రమాలు చేయకుండా ఉంటారా? అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికే ప్రజావేదికలో సమావేశం పెట్టాం.అన్ని నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మించారు.గత ప్రభుత్వ హయాంలో పెన్షన్, బర్త్‌సర్టిఫికెట్,రేషన్‌ కావాలన్న లంచం..జీవిత బీమా కోసం కూడా లంచం తీసుకున్నారు. ప్రతీ సోమవారం అన్ని కార్యాలయల్లో గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తాం.స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరిస్తాం.

అధికారులు చిరునవ్వుతో ప్రజల ఫిర్యాదులు స్వీకరించాలి.ఫిర్యాదులు స్వీకరించాక రశీదు ఇవ్వాలి.నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించాలి.ప్రతి మూడో శుక్రవారం సిబ్బంది సమస్యలపై దృష్టి సారించాలి.ప్రతివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.సిహెచ్‌సి,హాస్టళ్లలో నైట్‌హాల్ట్‌ చేయాలి.రాష్ట్రంలో ఇంటిస్థలం లేని వారు ఉండకూడదు.ప్రతి జిల్లాకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేయాలి.వెబ్‌పోర్టల్‌లో అన్ని విభాగాలను అనుసంధానం చేయాలి.ప్రతి ప్రభుత్వ ఆర్డర్‌ దానిలో అందుబాటులో ఉండేలా చూడాలి.ప్రభుత్వ పనుల వివరాలను కూడా వెబ్‌పోర్టల్‌లో ఉంచాలి. ప్రతినెలా మూడో శుక్రవారం చిన్న ఉద్యోగులు,కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను వినండి.మీ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించండి.లేదంటే నా దృష్టికి తీసుకురండి.మనం కలిసి ఆ సమస్యలను పరిష్కరిద్దాం.

Back to Top