కేంద్ర ఆర్థిక‌మంత్రితో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర‌మంత్రితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.17వేల కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధుల సమీకరణకు ఆటంకాలు లేకుండా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు విడుదల చేయాలని సీఎం కోరారు. రేపు ఉదయం 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైయ‌స్‌ జగన్‌ భేటీ కానున్నారు.

Back to Top