వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. వైయ‌స్ఆర్‌  జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో సీఎం వైయ‌స్‌ జగన్ నేడు పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు సీఎం బయలుదేరారు. 10.50 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. అనంత‌రం 11.10 నుంచి 11.30 మధ్య జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 11.45 నుంచి 12.45 గంటల మధ్య స్టీల్‌ ప్లాంట్‌ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొంటారు. 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.40 కి పులివెందుల చేరుకుంటారు. 2 గంటల నుంచి 2.15 వరకు పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మూలి బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 2.40 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top