పేద‌వాడికి మెరుగైన వైద్యం అందించ‌డ‌మే ల‌క్ష్యం

సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జగన్‌

 కోవిడ్ స‌మ‌యంలో ఎక్కువ క‌ష్ట‌ప‌డి,  ఒత్తిడిని తట్టుకొని ప‌ని చేస్తున్నారు 

స‌రిగ్గా ప‌ని చేయ‌క‌పోతే న‌చ్చ‌జెప్పి, కౌన్సిలింగ్ ఇచ్చి  ప‌ని చేయించండి 

అమరావతి: ప్రభుత్వాస్పత్రులను మరింత  బలోపేతం చేసి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను వర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రుల్లో సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను సీఎం వైయ‌స్ జగన్  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందులో కేవ‌లం 7 ఆసుప‌త్రుల్లో మాత్ర‌మే సీటీస్కాన్లు అందుబాటులో ఉన్నాయి. టెక్నాల‌జి, సాప్ట్‌వేర్ అప్‌డేట్ చేయ‌లేదు. ఈ ప‌రిస్థితి నుంచి పూర్తిగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను అన్నింటిని కూడా మార్చ‌బోతున్నాం. ఈ రెండేళ్ల‌లో  మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులను ఆందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామని తెలిపారు. నాడు-నేడు కార్య‌క్ర‌మంలో ఉన్న 11 ఆసుప‌త్రుల‌ను జాతీయ స్థాయిలో అప్‌గ్రేడ్ చేస్తున్నాం. టీచింగ్ కం న‌ర్సింగ్ కాలేజీని ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేస్తున్నాం. వీటిని కూడా ఆరోగ్య‌శ్రీ‌లోకి తీసుకువ‌స్తాం. ఆరోగ్య‌శ్రీ రోగుల‌కు ఉచితంగా డ‌య‌గ్న‌సిస్ ప్రాసెస్ అందుబాటులోకి తెస్తున్నాం. మిష‌న‌రీ ఎప్పుడు కూడా అప్‌గ్రేడేడ్‌గా బాగా ప‌ని చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.

 ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో విఫ‌రీత‌మైన మార్పులు తెస్తూ నాడు-నేడు కార్య‌క్ర‌మాన్ని శ్రీ‌కారం చుట్టాం. ఇందులో భాగంగా సిటీ స్కాన్‌, ఎంఆర్ఐ మిష‌న్లు ఏర్పాటు చేస్తున్నాం. లెటెస్ట్ టెక్నాల‌జీతో వీటిని ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. వీటికి మూడు సంవ‌త్స‌రాల వారంటీ, 7 ఏళ్ల మెయింటెనెన్స్ స‌ర్వీసులు ఈ మిష‌న్ల‌కు ఉంటాయి. మంచి స‌ర్వీసులు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఉండేలా చూస్తున్నాం. ఏడు చోట్ల పీపీపీ మోడ్‌లో ఉన్నాయి. దాన్ని మారుస్తున్నాం. శ్రీ‌కాకుళం, ఒంగోలు, నెల్లూరు, వైయ‌స్ఆర్ క‌డ‌ప‌లో ఎంఆర్ఐ, సిటీస్కాన్‌లు ఏర్పాటు చేస్తున్నాం. మిగిలిన ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నాం. కొత్త‌గా నిర్మించే ఆసుప‌త్రుల్లో కూడా ఇలాంటి మిష‌న్లు ఏర్పాటు చేసి పేద వాడికి మంచి జ‌ర‌గాల‌ని మ‌న‌సారా కోరుకుంటూ..మంచి జ‌ర‌గాల‌ని నాంది ప‌లుకుతున్నాం.

ఆసుప‌త్రిలో ఉన్న ప్ర‌తి డాక్ట‌ర్‌కు, న‌ర్స్‌లుకు , శానిటేష‌న‌రీ వ‌ర్క‌ర్స్‌, గ్రామ‌స్థాయిలో ఉన్న ఆశా వ‌ర్క‌ర్లు, వాలంటీర్లు, ఇలా కోవిడ్ స‌మ‌యంలో ఎక్కువ క‌ష్ట‌ప‌డి,  ఒత్తిడిని తట్టుకుంటున్న వారిని ఎంత పొగిడినా కూడా త‌క్కువే. అంత గొప్ప‌గా ప‌ని చేశారు. మీ అంద‌రిని అభినందిస్తున్నాం. ఇదే సంద‌ర్భంలో క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, డీఎంఅండ్‌హెచ్‌వోల‌కు అంద‌రికి కూడా మ‌రో విష‌యం. ఫీవ‌ర్ స‌ర్వే మ‌నం అనుకున్నంత‌గా జ‌ర‌గ‌లేద‌ని పేప‌ర్ల‌లో చూశాం. గ‌ట్టిగా మాట్లాడకండి. స‌రిగ్గా ప‌ని చేయ‌క‌పోతే న‌చ్చ‌జెప్పి, కౌన్సిలింగ్ ఇచ్చి వారితో ప‌ని చేయించండి. వారి మ‌న‌సుల‌ను నొప్పించ‌వ‌ద్దు. ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఈ స‌మ‌యంలో బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. 20 వేల పైచిలుకు కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ద‌య‌చేసి అంద‌రికి విజ్ఞ‌ప్తి ఏంటంటే..అంద‌రూ బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. అంద‌రూ బాగా చేస్తున్నారు కాబ‌ట్టే మంచి ఫ‌లితాలు సాధిస్తున్నాం. 

ఏ వ‌న్ న‌గ‌రాలు, పెద్ద పెద్ద ఆసుప‌త్రులు లేక‌పోయినా మ‌న డెత్ రేట్ త‌క్కువ‌గా ఉంది. పెద్ద పెద్ద న‌గ‌రాల‌తో మ‌నం పోటీ ప‌డుతున్నాం. దీనికి మీరు ప‌డుతున్న క‌ష్ట‌మే. ఒత్తిడిలో బాగా ప‌ని చేస్తున్నారు కాబ‌ట్టే ఇది సాధ్య‌మైంది. టెంప‌ర్ కాకుండా చూసుకోండి. స‌ర్దిచెప్పి ప‌నులు చేయించండి. ఈ మంచి కార్య‌క్ర‌మం ద్వారా మ‌నం నాడు-నేడు కార్య‌క్ర‌మంలో మ‌రో అడుగు ముందుకు వేసిన‌ట్లే..అంద‌రికీ  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మ‌న‌సారా శుభాకాంక్ష‌లు తెలిపారు.

 

తాజా వీడియోలు

Back to Top