గుంకలాం చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పైలాన్‌ ఆవిష్కరణ

విజయనగరం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో విజయనగరం జిల్లా గుంకలాం చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతిపెద్దదైన గుంకలాంలోని వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీ 397.36 ఎకరాల లేఅవుట్‌లో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుంకలాంలోని వైయస్‌ జగనన్న కాలనీ లేఅవుట్‌లో నిర్మించిన మోడల్‌ హౌస్‌ను పరిశీలించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ సభా వేదికకు సీఎం చేరుకున్నారు. మ‌రికొద్దిసేప‌ట్లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు.

Back to Top