కడప : నైపుణ్యతకు, నాణ్యతకు నిలువెత్తు నిదర్శనం.. వైయస్ఆర్ జిల్లా కలెక్టరేట్ అని.. పుష్కలమైన పరిపాలన వనరులకు కేంద్ర బిందువుగా రాష్ట్రంలో గుర్తింపు నిచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. జిల్లా మినరల్ ఫండ్ ద్వారా.. ఆధునీకరించిన జిల్లా కలెక్టరేట్ నూతన భవనాన్ని శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వీటితో పాటు అగ్నిమాపక ఉపకరణాల (రెస్క్యూ పరికరాలు)ప్రారంభం, దివ్యంగులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ జరిగింది. ముందుగా నైపుణ్యతకు, నాణ్యతకు నిలువెత్తు నిదర్శనంగా అత్యంత ఆకర్షణీయంగా ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టరేట్ పరిపాలనా విభాగాలు, కంట్రోల్ రూమ్ నిర్వహణ విధుల గురించి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా.. రూ. 6 కోట్ల డిఎంఎఫ్ నిధులతో పంచాయత్ రాజ్ శాఖ ద్వారా కలెక్టరేట్ భవన ఆధునీకరణ చేపట్టడం జరిగింది. కొత్తగా ఆధునీకరించిన భవనంలో.. అన్ని విభాగాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అభివృద్ధికి తర్కాణంగా.. పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుతో పాటు మెకానికల్, ప్లంబింగ్, ల్యాండ్‌స్కేప్ డెవలప్‌మెంట్ వంటి సాధారణ సేవలను పునరుద్ధరించడం జరిగింది. కాగా 1800వ సంవత్సరంలో స్థాపించబడిన YSR జిల్లా.. సుస్థిరమయిన జిల్లా పరిపాలనా కేంద్రాన్ని కలిగి ఉంది. ఇక్కడ పరిపాలనా పరమైన, ఉద్యోగుల పునశ్చరణ శిక్ష కోసం సమగ్రమైన జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఉంది. సభా భవన్, స్పందన హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్ వంటి వేదికలలో ఓరియంటేషన్లు మరియు శిక్షణలతో సహా ఉద్యోగుల సామర్థ్య నిర్మాణ సెషన్‌లు నిర్వహించడం జరుగుతోంది. రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ శనివారం కడప కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లాలోని అర్హులైన 50 మంది దివ్యాంగులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. శారీరక వైకల్యాలున్న వ్యక్తులు ఎదుర్కొనే చలనశీలత సవాళ్లను పరిష్కరించడానికి, వారికి సౌకర్యవంతమైన స్వతంత్ర రవాణా మార్గాలను అందించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను అర్హులైన వారికి పంపిణీ చేసే.కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కాంపోనెంట్ కింద జిల్లా పరిపాలన యంత్రాంగం, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల సహకారంతో దివ్యంగుల జీవన ప్రమాణాలు, వారి జీవనోపాధి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం జరిగింది. అంతే కాకుండా.. ADIP పథకం కింద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ & ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ALIMCO) నియోజకవర్గ స్థాయి శిబిరాల్లో 6,509 మంది వికలాంగులకు సహాయాలు మరియు సహాయక పరికరాలను విజయవంతంగా పంపిణీ చేసింది. ఇందుకు గాను మొత్తం రూ. 5.85 కోట్లు వెచ్చించడం జరిగింది. అగ్నిమాపక ఉపకరణాల (రెస్క్యూ పరికరాలు)ప్రారంభోత్సవం వరదలు, తుఫానులు మొదలైన ప్రకృతి విఫత్కర సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే ఉద్దేశ్యంతో.. జిల్లా మినరల్ ఫండ్ ద్వారా రూ.77,423 లక్షల వ్యయంతో.. వై.ఎస్.ఆర్. జిల్లా అగ్నిమాపక విభాగం కొనుగోలు చేసిన రెస్క్యూ పరికరాలను శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అందులో భాగంగా.. వరదలు, తుఫానులు మొదలైన సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ బోట్‌లను, రెస్క్యూ బోట్లను నడపడానికి ఉపయోగించే అవుట్ బోర్డ్ మోటార్లు, బాధితులను వరద నీటిలో తేలియాడేలా చేయడానికి ఉపయోగించే లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, రెస్క్యూ బోట్‌లను శుభ్రం చేయడానికి, నీటి నుండి బైలింగ్ చేయడానికి ఉపయోగించే పోర్టబుల్ పంపులు, అలాగే.. వరదలు, తుఫానులు, ప్రమాదాలు మొదలైన సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, అన్ని రకాల రెస్క్యూ ఆపరేషన్ల కోసం రెస్క్యూ కండక్ట్ చేయడానికి ఉపయోగించే రెస్క్యూ రోప్‌లను ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. జిల్లా ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, కడప నగర మేయర్ కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి, ఎపిఎస్ ఆర్టీసీ చైర్మన్ ఈ. మల్లికార్జున రెడ్డి, జేసీ గణేష్ కుమార్, కడప నగర కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, డిఆర్వో గంగాధర్ గౌడ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.