ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు

కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్ సమీక్ష

జిల్లాకొక కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఉండాలని స్పష్టీకరణ

తాడేపల్లి:  ప్రతి ఆసుపత్రిలో విధిగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని, సంబంధిత లక్షణాలతో వచ్చినవారి పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ జమాత్ కు వెళ్లొచ్చినవాళ్లు, వారు కలిసిన వ్యక్తులకు త్వరగా పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ కరోనా టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని, ఇప్పుడున్న ల్యాబ్ ల సామర్థ్యం పెంచాలని పేర్కొన్నారు. కరోనా వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలు పాటించేలా చూడాలని సీఎం ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top