గొల్ల‌ప్రోలు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చేరుకున్నారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరిన సీఎం కొద్దిసేప‌టి క్రిత‌మే గొల్ల‌ప్రోలుకు చేరుకున్నారు. వైయ‌స్ఆర్ కాపు నేస్తం మూడో విడుత సాయం గొల్ల‌ప్రోలు వేదిక‌గా కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి మ‌రికాసేప‌ట్లో విడుద‌ల చేయ‌నున్నారు. వరుసగా మూడో ఏడాది కాపు నేస్తం అమలుకు సర్వత్రా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లో రూ.508.18 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జ‌మ చేయ‌నున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైయ‌స్ఆర్  కాపు నేస్తం అమలు చేస్తున్నారు.

Back to Top