మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న బాలుడికి త‌క్ష‌ణ‌మే రూ.1 ల‌క్ష ఆర్థిక‌సాయం

వైయ‌స్ఆర్ జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. వైయ‌స్ఆర్ జిల్లా పర్యటనలో భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు సీఎంని కలిసి తమ కుమారుడి అనారోగ్య సమస్యను వివరించారు. 
వెంటనే స్పందించిన సీఎం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే  జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు రూ. 1 లక్ష ఆర్ధిక సాయం అందించనున్నారు.
భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు, తను కడపలో రోజూ కూలీపనికి వెళుతూ జీవనం సాగిస్తున్నానని, తన కుమారుడు నరసింహ (12 సంవత్సరాలు) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ ఇబ్బందిని ముఖ్యమంత్రికి చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం నరసింహ కుటుంబానికి వెంటనే రూ. 1 లక్ష ఆర్ధిక సాయం చేయాలని, అంతేకాక ఆ బాలుడి వ్యాధికి మెరుగైన చికిత్సకు ఎంత ఖర్చు అయినా, ఎక్కడైనా సరే చేయించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

సీఎం స్పందనతో బాధిత కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి గారు స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. 

Back to Top