తాడేపల్లి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం సంతోషకరంగా, ఆరోగ్యప్రదంగా గడవాలని కోరుకుంటున్నా. ఈ సంవత్సరం శాంతిని, అపార సంపదను మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అందించాలని కోరుకుంటున్నా. మీ అందరి కలలు, ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.