ఎమ్మెల్యే వెంక‌ట సుబ్బ‌య్య మృతి: ‌సీఎం దిగ్భ్రాంతి‌

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ జి.వెంకట సుబ్బయ్య మృతిపట్ల పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట సుబ్బయ్య కడపలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. 

Back to Top