గవర్నర్‌ను కలిసి సీఎం వైయస్‌ జగన్‌ దంపతులు

 విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం వైయస్‌ జగన్‌ దంపతులు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై సీఎం వైయస్‌ జగన్‌ గవర్నర్‌తో చర్చించారు.

ముఖ్యమంత్రి దంపతుల గౌరవార్థం రాజ్‌భవన్‌ లంచ్‌ ఏర్పాటు చేసింది. గవర్నర్‌ ఇచ్చిన విందు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు రాజ్‌భవన్‌ నుంచి క్యాంప్‌ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు. అంతకు ముందు ముఖ్యమంత్రికి గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

Read Also: మార్కెట్‌ యార్డుల్లో ‘నాడు–నేడు

Back to Top