టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి కుమారుడి ఆక‌స్మిక మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి:  తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈఓ ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు పలు విధాలుగా చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. చంద్రమౌళి ఆకస్మిక మృతి పట్ల టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఈఓ కుటుంబానికి ముఖ్యమంత్రి తన ప్ర‌గాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top