పాతపాటి స‌ర్రాజు మృతికి సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

తాడేపల్లి: క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి స‌ర్రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స‌ర్రాజు మృతికి సంతాపం తెలియజేసిన సీఎం వైయస్‌ జగన్‌.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

పాతపాటి సర్రాజు గుండెపోటుతో మృతిచెందారు. 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు  రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్‌ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా  సర్రాజు ఉన్నారు.

Back to Top