పోలీస్‌ అమరవీరులకు సీఎం వైయ‌స్ జగన్‌ నివాళి

 విజయవాడ:  పోలీసు అమ‌ర‌వీరుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు స్టేడియానికి చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌కు  హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా పోలీస్‌ అమరవీరులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైయ‌స్ జగన్ గౌరవ వందనం స్వీకరించారు. 'అమరులు వారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు.  కాగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top