రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన నాయ‌కులు

తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి తిరుపతి పర్యటనకు బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితమే రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయ‌కులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రేణిగుంట నుంచి రోడ్డుమార్గం ద్వారా తిరుమల శ్రీపద్మావతి గెస్ట్‌హౌస్‌కు చేరుకోనున్నారు.  సాయంత్రం అన్నమయ్య భవన్‌ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. సాయంత్రం 6:15 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకొని ప్రభుత్వ తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకుంటారు. రాత్రి 7:40 గంటలకు పద్మావతి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top