ఏపీకి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో ఘ‌న‌స్వాగ‌తం

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏపీకి చేరుకున్నారు. ఇటీవ‌ల‌ విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. త‌న ప‌ర్య‌ట‌న ముగించుకుని తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైయస్ జగన్‌కు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వారిలో మంత్రి జోగి రమేష్, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ వెంక‌ట రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నేరుగా తాడేప‌ల్లిలోని త‌న నివాసానికి చేరుకున్నారు. 

Back to Top