పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైన తొలిరోజు నుంచే విద్యా కానుక‌ కిట్ల పంపిణీ

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం వంటి విద్యా సామాగ్రి కోసం ఇబ్బంది ప‌డ‌కుండా పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైన తొలిరోజు నుంచే జ‌గ‌న‌న్న విద్యా కానుక‌ కిట్ల పంపిణీని మ‌న ప్ర‌భుత్వంలో చేప‌డుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ విద్యా కానుక కిట్ల పంపిణీ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
 
వ‌రుస‌గా నాలుగో ఏడాది జ‌గ‌న‌న్న విద్యాకానుక కిట్ల పంపిణీని నేడు ప్రారంభిస్తున్నాం. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం వంటి విద్యా సామాగ్రి కోసం ఇబ్బంది ప‌డ‌కుండా పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైన తొలిరోజు నుంచే ఈ కిట్ల పంపిణీని మ‌న ప్ర‌భుత్వంలో చేప‌డుతున్నాం. ఈ ఏడాది యూనిఫాం డిజైన్‌లో మార్పులు చేసి, మెరుగ్గా తీర్చిదిద్దాం. షూస్ నాణ్య‌త పెంచడంతో పాటు పుస్తకాల బ్యాగ్ సైజ్‌ను కూడా పెంచాం. విద్యార్థులకు 10 వ‌స్తువులతో కూడిన కిట్ల‌ను రూ.1,042 కోట్ల ఖ‌ర్చుతో అందిస్తున్నాం అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Back to Top