మైనార్టీ మహిళ వైద్యం కోసం స్పందించిన సిఎం

తక్షణ ఆర్థిక సహాయం కోసం కలెక్టర్ కు ఆదేశం 

రాజమహేంద్రవరం: జిల్లా పర్యటన ముగించుకుని వెళుతున్న సందర్భంలో రాజమహేంద్రవరం కు చెందిన  ఎస్కే అబ్దుల్ షుకుర్ తన కుమార్తె ఎస్కే. షర్మిలా (40) కీళ్ళ వాతము సమస్య తో  బాధపడుతున్నట్లు తెలియచేసి, తమ కుమార్తె వైద్య ఖర్చులు భరించే స్థితిలో లేమని , తమ కుమార్తె కు వైద్య కోసం ఆర్థిక సహాయం కోసం ముఖ్య‌మంత్రిని అభ్యర్థించారు.  వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణ ఆర్థిక సహాయంగా లక్ష రూపాయల అందించి పాపకు మెరుగైన వైద్య చికిత్స చేయించాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు ఎస్కే  షర్మిల వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు చెక్కు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

తమ కుమార్తె వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి స్వయంగా  స్పందించి ఇచ్చిన హామీ కి ముందస్తు భరోసాగా లక్ష రూపాయల  ఆర్థిక సాయం చేయడం పై ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top