కాల్వల ద్వారా చెరువుల అనుసంధానం

ఈఏపీ (ఎక్స్‌టర్నెల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌)పై సీఎం శ్రీ వైయస్ జగన్‌ సమీక్ష 

నిర్దేశిత సమయంలోగా వివిధ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడండి

అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లు పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టి

 తాడేప‌ల్లి: రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా?.. ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలన్నారు. ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలని సూచించారు. న్యూడెవలప్‌మెంట్‌ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ), జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోపరేషన్‌ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణసహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులనూ సమీక్షించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ. 25,497.28 కోట్లు ఖర్చుచేస్తున్నామ‌ని చెప్పారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఈఏపీ (ఎక్స్‌టర్నెల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌)పై సీఎం శ్రీ వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. 

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: 
– ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూసుకోవాలన్న సీఎం. 
– నిర్దేశిత సమయంలోగా వివిధ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్న ముఖ్యమంత్రి. 

 –రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలన్న సీఎం. 
– నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలన్న సీఎం. 
– ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలన్న సీఎం. 
– ఈ చెరువులన్నింటినీకూడా గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలన్న సీఎం. 
– దీనివల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందన్న సీఎం. 
– చెరువు కింద చక్కగా భూములు సాగు జరుగుతుందని, వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయన్న సీఎం. 
– ఒక సమగ్రమైన అధ్యయనం చేసి, ఈప్రాజెక్టును చేపట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం. 
– ప్రపంచబ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో దీన్ని చేపట్టాలని అధికారులకు సూచించిన సీఎం. 

– పనులు పూర్తిచేయకుండా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లు ... వీటిని పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. 

– రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నాం.
– వీటిచుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయి కాబట్టి, వాటి పరిధిలో ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అన్నది చాలా అవసరం. 
– దీనివల్ల పోర్టు ఆధారితంగా పెద్ద  ఎత్తున అభివృద్ధి జరుగుతుంది : అధికారులతో సీఎం.

ఈ సమీక్షా సమావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జి సృజన, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ పి రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top