అక్టోబర్‌ 1  నాటికి బెల్ట్‌షాపులు ఎత్తివేయాలి

గంజాయి సాగును నియంత్రించాలి

కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించాలి

పోలవరం నిర్వాసితుల సమస్యలపై శాశ్వత గ్రీవెన్స్‌ సెల్‌

రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి: అక్టోబర్‌ 1 నాటికి బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.రెండు రోజు కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల పక్కన మద్యం షాపులను అనుమతించొద్దని తెలిపారు.దాబాల్లో  మద్యం విక్రయాలు జరిపొద్దని ఆదేశాలు ఇచ్చారు. గంజాయి సాగును పూర్తిగా నియంత్రించాలని..ఆగస్టులో ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించాలన్నారు. గిరిజనులకు ఉపాధి కల్పించి సాగు నుంచి దూరం చేయాలని తెలిపారు.పోలవరం నిర్వాసితుల సమస్యలపై శాశ్వతంగా గ్రీవెన్స్‌ సెల్‌ పెట్టాలని నిర్ణయించామన్నారు.ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు.పోలవరం నిర్వాసితుల సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. పోలవరం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్ట్‌ అని తెలిపారు.ఆర్థికంగా ఎలాంటి సహాయమైనా అందిస్తామన్నారు.విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ అంశంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించాలన్నారు.ఏ పార్టీ నాయకులు ఉన్నా ఉపేక్షించొద్దన్నారు.పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాసాగు వల్ల మంచినీరు కలుషితమవుతుందని..మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.కలెక్టర్,పంచాయతీ రాజ్‌ శాఖ ఈ విషయంలో సీరియస్‌గా ఉండాలన్నారు.ప్రజలకు తాగునీరు అందించకపోతే చాలా సమస్యలు వస్తాయన్నారు.
పోలీస్‌ వీక్లీఆఫ్‌లపై కమిటీ నివేదికను విడుదల చేసిన సీఎం 
పోలీస్‌ వీక్లీఆఫ్‌లపై కమిటీ నివేదికను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. పోలీసులకు వీక్లీఆఫ్‌ ప్రకటించడం చాలా సంతోకరమైన విషయం అని, కానిస్టేబుల్,హెడ్‌ కానిస్టేబుల్‌ స్థాయి ఉద్యోగులకు వీక్లీ ఆఫ్‌ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌  అన్నారు.సీఎం జగన్‌  నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top