తాడేపల్లి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సమీక్ష చేపట్టనున్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకేల నిర్మాణాల ప్రగతి గురించి సీఎం వైయస్ జగన్ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలపై ఈ సమీక్షలో సీఎం వైయస్ జగన్ చర్చించనున్నారు. ఖరీఫ్ అవసరాలు, రబీ సన్నద్ధతపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. వైయస్సార్ జగనన్న శాశ్విత భూహక్కు-భూరక్ష పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు.