ట్రెండింగ్‌లో దుమ్ము రేపిన సీఎం వైయ‌స్ జగన్‌ బర్త్‌డే విషెస్‌

ప్రపంచ వ్యాప్తంగా సీఎం వైయ‌స్ జగన్‌ బర్త్‌డే  #HBDYSJagan హ్యాష్‌ ట్యాగ్‌ హల్‌ చల్‌ 

అమరావతి: సీఎం వైయ‌స్‌ జగన్‌ చరిష్మా ఏపా­టిదో మరోసారి ప్రపంచానికి తెలిసింది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పుట్టిన రోజు నాడు సామాజిక మాధ్య­మాల వే­ది­క­గా ప్రపంచ వ్యాప్తంగా అభినందల వెల్లువతో రి­కా­ర్డులు సృష్టించింది. హెచ్‌బీడీ వైయ‌స్‌ జగన్‌ పేరుతో ఏర్పాటు చేసిన హ్యాష్‌ ట్యాగ్‌ ద్వారా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా 3.50 లక్షల మందికి పైగా శుభాకాంక్షలు తెలుపడం ద్వారా ఇండియా ట్రెండింగ్‌లో తొలి స్థా­నంలో నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా వైయ‌స్‌ జగన్‌ పుట్టిన రోజు సందేశం 18.1 కోట్ల మందికి చేరినట్లు ఎక్స్‌ గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రపం­చ వ్యా­ప్తం­గా  డంకీ, సలార్‌ వంటి సినిమాలు విడుదల అ­వు­తున్న సమయంలో ఒక రాజకీయ పార్టీ అధినేత పుట్టిన రోజు ఇంత ట్రెండింగ్‌ కావడం విశేషం. 2 గంటల పాటు ఎక్స్‌ ఇండియా సర్వర్‌ షట్‌డౌన్‌ అయి­నప్పటికీ ఈ స్థాయిలో ట్వీట్లు రావడం గమనార్హం. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రే­లియా వంటి దేశాల నుంచి పోస్ట్‌లు వెల్లువెత్తాయి.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా 5వ స్థానం, ఆసియా­లోనూ 5వ స్థానంలో హ్యాపీ బర్త్‌డే వైయ‌స్‌ జగన్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్య­క్షుడు పవన్‌ కళ్యాణ్‌తో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు వైఎస్‌ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైయ‌స్ జగన్‌ 55 నెలల పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు చూపేలా రూపొందించిన ఫొటోను వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా గురువారం విడు­దల చేసింది.

ఓ వైపు పచ్చని పంట పొలాలు, ప్రాజె­క్టుల నిర్మాణంతో పాటు కార్పొరేట్‌ స్కూళ్లకు దీటు­గా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివా­లయం, వైయ‌స్ఆర్‌ విలేజ్‌ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలతో ఈ ఫొటో ఆకర్షణీయంగా ఉంది. సామా­జిక మాధ్యమాల్లో ఈ చిత్రం వైరల్‌ అయ్యింది.  

Back to Top