కాకినాడ: జగ్గంపేట నియోజకవర్గంలో బుధవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇర్రిపాకలోని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసానికి వెళ్లిన సీఎం వైయస్ జగన్.. నూతన వధూవరులు అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లను ఆశీర్వదించారు. అంతకు ముందు ఇర్రిపాకలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు,ఎమ్మెల్యేలు సీఎం వైయస్ జగన్‌కు సాదర స్వాగతం పలికారు.