ఈ మూడు కేటగిరిల్లోని సిబ్బందికి పూర్తి జీతం

తాడేపల్లి: కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభినందించారు. కరోనా నియంత్రణకు ముమ్మర చర్యలు చేపడుతున్న ఆరోగ్య శాఖ, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. కరోనా నియంత్రణకు వారి యత్నాలు ప్రశంసనీయమని కొనియాడారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. ఈ మూడు కేటగిరిల్లో సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించాలని  నిర్ణయించారు. 
కాగా, రాష్ట్రం అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వంపై అదనపు భారం పడింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల అంగీకారం మేరకు వారి జీతాలు రెండు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
 

తాజా వీడియోలు

Back to Top