సింహం సింగల్ గా వస్తుంది... అదీ వైయ‌స్ జగనే 

విజ‌య‌వాడ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సినీ న‌టుడు అలీ

విజ‌య‌వాడ‌:  సింహం ఎప్పుడూ కూడా సింగిల్‌గానే వ‌స్తుంద‌ని, అదీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే అంటూ సినీ న‌టుడు అలీ పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధి పై చాలా‌ మంది అపోహలు సృష్టిస్తున్నార‌ని, ఎవరూ అపోహలకు లోను కావద్దు..వైయ‌స్ జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యమ‌ని చెప్పారు. శ‌నివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధులకు మద్ధతుగా సినీ నటుడు అలీ ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఇచ్చిన హామీలన్నీ  నెరవేరుస్తున్న ఏకైక నేత వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ముఖ్య‌మంత్రి  చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. రాబోయే తరాల భవిష్యత్ చూసి ఓటు వేయాల‌ని సూచించారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న చూశాం..ఇప్పుడు వైయ‌స్ జగన్ పాలనను చూస్తున్నామ‌ని చెప్పారు.   సామాన్య మైనారిటీ మ‌హిళా కరీమున్నీసా కు పిలిచి వైయ‌స్ జ‌గ‌న్ ఎమ్మెల్సీ టికెట్టు ఇచ్చార‌ని తెలిపారు. ఒక సామాజిక వర్గానికి కాకుండా అన్ని కులాల వారికి న్యాయం చేయాలన్నదే వైయ‌స్ జగన్ తపన అన్నారు. ఇళ్ల స్దలాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నార‌ని అలీ వివ‌రించారు

తాజా ఫోటోలు

Back to Top