ఎప్పుడు వెళ్ళిపొదామా అన్నట్టు టీడీపీ సభ్యులు ప్రవర్తన  

అమ‌రావ‌తి: ఎప్పుడు సస్పెండ్ చేసుకుని వెళ్ళిపొదామా అన్నట్టు టీడీపీ సభ్యులు ప్రవర్తన ఉంద‌ని  చీఫ్ విప్ ప్రసాద్ రాజు అన్నారు.  బి.ఏ.సి లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సభ జరుగుతుంద‌ని చెప్పారు. సభను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తుందన్నారు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్యం సిద్దంగా ఉందన్నారు. చర్చకు టీడీపీ నాయకులు భయపడుతున్నారు.. సబ్జెక్ట్ లేకుండా సభకు వస్తున్నారు..చంద్రబాబు బలవంతంగా ఎమ్మెల్యేలను సభకు పంపుతున్నట్లు ఉంది. ఈరోజున సభకు వచ్చి ప్రతిపక్షం చర్చలో పాల్గొనాలని  ప్రసాద్ రాజు కోరారు.

తాజా వీడియోలు

Back to Top