బద్వేల్‌ ఉప ఎన్నిక‌లో భారీ మెజారిటీతో  గెలుస్తాం

 ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రెండేళ్లు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే గెలిపిస్తాయి

ఈ రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి భారీ విజయాలు దక్కాయి

కొందరు కులమతాల మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారు

కులాలను తెరపైకి తెచ్చి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు

సీఎం వైయస్‌ జగన్‌ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు

ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా విపక్షాలు పని చేస్తున్నాయి

తాడేపల్లి: బద్వేల్‌ ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ భారీ మెజారిటీతో  గెలుస్తుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్‌ సుధ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అడుగుతామన్నారు. ప్రజాక్షేత్రంలో..ప్రజాతీర్పు కోరేందుకు టీడీపీ వెనుకడుగు వేస్తుందని విమర్శించారు. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా విపక్షాలు పని చేస్తున్నాయని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

2019 బద్వేల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి 44 వేల మెజారిటీ వచ్చింది..అదే మెజారిటీ ఉప ఎన్నికల్లో కూడా రావాలని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. వారసత్వ రాజకీయాలు..మరొకటి అనుకున్నా కూడా..చనిపోయిన చోట ఆ కుటుంబ సభ్యులు పోటీలో ఉండటం సహజంగా వస్తోంది. మా నాయకుడు నిర్ణయించిన అభ్యర్థి వైద్యురాలు, విద్యావంతురాలు, మహిళా కావడంతో నియోజకవర్గానికి చెందిన అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంచి మెజారిటీతో సుధను గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారు.

ఈ రెండేళ్లలో ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించ..కరోనా పరిస్థితిలో ఆర్థికసంక్షోభం ఏర్పడినా..అనేక ప్రాంతాల్లో వలసలు వెళ్తున్నారు. చాలా చోట్ల ప్రజలను పట్టించుకునే వారు కరువయ్యారు. కానీ ఏపీలో మాత్రం ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం అండగా నిలిచింది. లక్ష కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఇది. ప్రతి ఒక్కరికీ ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైయస్‌ జగన్‌ది.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఇది. అందుకే ధైర్యంగా ప్రజల చెంతకు వెళ్తాం. వైయస్‌ఆర్‌సీపీకి కంచుకోటగా ఉన్న వైయస్‌ఆర్‌ జిల్లాలో మరింతగా బలపరచే విధంగా మేమంతా సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆ విధంగా ముందుకు వెళ్తాం. ప్రజా తీర్పులో ఇదే తేలబోతోంది.

రెండేళ్లలో జరిగిన ఎన్నికల్లో గమనిస్తే..రాష్ట్రంలో 13 వేల మంది సర్పంచ్‌లు ఉంటే..అందులో 10,500 పైగా సర్పంచ్‌లు మా పార్టీకి  ఉన్నారు. 10,045 మంది ఎంపీటీసీలకు  గాను 9,600 ఎంపీటీసీలు మా పార్టీ తరఫున గెలిచారు. 634 మంది ఎంపీపీలు వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఎన్నికయ్యారు. 641 చోట్ల జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 631 చోట్ల మా పార్టీ వారే జెడ్పీటీసీలుగా గెలుపొందారు. 13 మంది జిల్లా పరిషత్‌ చైర్మన్లు మా పార్టీ వారే. 621 కార్పొరేటర్లలో 518 మంది వైయస్‌ఆర్‌సీపీకి ఉన్నారు. 2173 కౌన్సిలర్‌ స్థానాలకు ఎన్నికలు జరిగితే..1800పైగా మా పార్టీ తరఫున గెలిచారు.

75 మున్సిపల్‌ చైర్మన్లలో మా పార్టీ నుంచే 74 మంది ఉన్నారు. ఇంత బలంతో దేశంలో ఏ పార్టీకి లేని విధంగా వైయస్‌ఆర్‌సీపీకి జనం అధికారాన్ని కట్టబెట్టారు. ఈ రకమైన ఫలితాలు వచ్చాయి కాబట్టి ..ఇవన్నీ కూడా ప్రజల్లో ఉత్సాహం పెంచుతుందని, వైయస్‌ఆర్‌సీపీ బలం పెరుగుతుందనే దురుద్దేశ్యంతో..కుప్పంలో జరిగిన పరాభవంతో తలెత్తుకోలేక కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజులు మేం నిశ్శబ్ధంగా ఉంటాం. మీరు వెళ్లి కుల, మతాలను రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలను గత కొద్దిరోజులుగా చూస్తున్నాం. 

ఇంత బలం ఉన్నా కూడా మా నాయకుడి వైయస్‌ జగన్‌ విధానం ఎలా ఉంటుందంటే..ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలని, బలం పెరిగే కొద్ది మనలో అహంభావం పెరగకూడదని ప్రజలకు మనం ఏం చేశామో చెప్పే రీతిలో ఉండాలని మాకు చెబుతుంటారు. రాజకీయాల్లో ఒక డిసిప్లేన్‌ ఉండాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ రీతిలో ప్రతిపక్షం ఉందా? మా ప్రభుత్వం ఏ తప్పు చేస్తోందో ప్రతిపక్షం చెప్పలేక ..ఊహకు అందని  విధంగా కుల మతాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. నిర్మాణాత్మకంగా ప్రశ్నించడానికి టీడీపీ, జనసేన ఏమీ లేవు. మీరు ఏవైనా చూపిస్తే మేం సరిచేస్తాం.

రోడ్లు బాగలేవు అంటున్నారు. చూపించండి..మా శక్తిమేరకు చేస్తామని చెబుతున్నాం. ఈ అంశాలను చెప్పకుండా ఎందుకు డైవర్షన్‌ చేస్తున్నారు. కేవలం ఒక ఎజెండాతో కుట్రలు చేస్తున్నారు. ప్రజాదరణ పొందుతున్న పార్టీని చూసి భయపడుతున్నారా?. బద్వేల్‌ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామని ప్రతిపక్షాలు చెప్పే దమ్ముందా?. ప్రజాతీర్పులో ఏ రోజు ముందుకు రారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున భీపాం ఇచ్చి..మళ్లీ మేం పోటీ చేయలేదంటారు. ప్రజాక్షేత్రంలోకి రాకుండా వెనుకడుగు వేసిన పార్టీ భహుష్య టీడీపీ ఒక్కటే ఉంటుంది.

సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం వైయస్‌ జగన్‌ వద్దకు వచ్చి ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం అమలు చేయమని అభ్యర్థించి తరువాతే ఈ విధానంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఏమోషన్‌కు గురై ఇష్టానుసారంగా కులాలు, మతాలపై ఎందుకు మాట్లాడుతున్నారు. మీ ప్రస్టేషన్‌ ఏంటి? మీ డిమాండ్‌ చెప్పకుండా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.

కులాలు నాకు సంబంధం లేదని చెబుతూనే..మళ్లీ వారిని రెచ్చగొట్టి లబ్ది పొందాలని కులాలను తెర పైకి తెస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక 56 కార్పొరేషన్లలో చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. 70 మందికి పైగా చైర్మన్లను చేశారు.700 మందికి పైగా డైరెక్టర్లను నియమించారు. ప్రభుత్వం నియమించిన అన్ని పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. బడుగు, బలహీన వర్గాలకు 50 శాతంకు పైగా పదవులు ఇచ్చారు. వీటిపై ఏ రోజు చర్చ పెట్టరు. ఇన్ని మంచి కార్యక్రమాలకు చట్టం తెచ్చి వాటిని అమలు చేసింది వైయస్‌ జగన్‌..ఇవీ ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? కడుపు మంటకు మందు లేదన్నట్లుగా ధ్వేషం, ఈర్ష్యతో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి.

ఆన్‌లైన్‌ టికెట్లతో నష్టం జరుగుతుందని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని చట్టాలు ఈ ప్రభుత్వం చేసింది. దేవాలయాలు, చర్చిలు, మసీదుల అంటారు, కులాలు అంటారు. ఎందుకంత ఈర్ష్య..మీరు వాడుతున్న భాషలు..నిందలు బాధాకరం. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా..బురద జల్లుతుంటే మేం సమాధానం చెబుతాం. మీరు విమర్శ చేసినప్పుడు మేం ఆన్సర్‌ ఇవ్వాలి కదా? 

ప్రభుత్వ పాలనలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్లు ప్రశ్నించండి..కచ్చితంగా మీ వద్దకు వచ్చి సమాధానం చెబుతాం. మీ ప్రశ్నలు సంధించండి. ప్రెండ్లీగా ఉండాలన్న మా ఆలోచనలు పట్టించుకోకపోవడం సరికాదు.
చంద్రబాబు రాజకీయాల్లో విలువలు పూర్తిగా దిగజార్చారు. వెన్నుపోటుతో పార్టీని లాక్కున్నారు. జీవితాంతం చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారు. ప్రజా బలం ఉన్నంత వరకు వైయస్‌ఆర్‌సీపీని ఎవరూ ఏమీ చేయలేరు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం. వ్యవస్థలను కాపాడుతాం.

అంతా మంచి జరుగుతుంది కాబట్టే పాలసీలపై కాకుండా డైవర్షన్‌ టాపిక్స్‌లోకి Ðð ళ్తున్నారు. దేనిపైనైనా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అడిగే రీతిలో అడగండి. వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా విపక్షాలు పనిచేస్తున్నాయని ఇలాంటి ధోరణి మార్చుకోవాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపక్షాలకు హితవు పలికారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top