దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి

చంద్రబాబు ఆందోళన భ్రమరావతి గురించే 

ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను మోసం చేశారు

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాలు చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్బరాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల తరహాలో వ్యవహరించారని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఏ నాడు కూడా రైతుల పక్షాన నిలిచిన రోజే లేదు. ఈ రోజు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. కేవలం తన బినామీలు, భ్రమరావతి గురించి చంద్రబాబు ఆందోళన చెందుతున్నాడు. ఆ ఆందోళనను రైతుల సమస్యగా సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలించినట్లు కాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు తీసేయడంతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాం. ఈ రోజు చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకునేందుకు ధైర్యం చేయాలి. మేం చేసింది తప్పు అనుకున్నప్పుడు నీ 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. రెఫరెండం తెలుస్తుంది. అలా కాకుండా ఏదో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో నీవు చేసిన తప్పులు బయటపడ్డాయని ఆందోళన చెందుతున్నారు. ఎందుకు నిన్ను నీవు రక్షించుకునేందుకు సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటున్నావు. నిన్ను కాపాడుకునేందుకు ప్రజలను బయటకు రావాలని పిలుపునిస్తున్నావ్‌. ఆ రోజు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయినప్పుడు కూడా రాష్ట్ర ప్రజలంతా నా చుట్టు చేరి కాపాడాలని కోరారు. నీవు చేసిన తప్పులకు నీవు శిక్ష అనుభవించాలి కానీ..ఎందుకు ప్రజలను లాగుతున్నావ్‌. నీవేమైనా గాంధీ, అంబేద్కర్‌వా? ..నీవు చేసిన దుర్మార్గలతో దొరికిపోతే ప్రజలెందుకు ముందుకు వస్తారు. కేవలం నీవు చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు ఏదోరకంగా డైవర్ట్‌ చేసేందుకు ఈ రోజు పోరాటాలు చేస్తున్నావు. రాయలసీమ వాసిగా చెబుతున్నాను. ఒక రాజధానికి కొత్త నగరం నిర్మించాలంటే..ఈ రోజు సీఎంగా మీరు, అప్పటి మంత్రి నారాయణ లక్ష పది వేల కోట్ల అవసరం అన్నారు. అటువంటి సమయంలో కొత్త నగరం నిర్మించే కన్న తక్కువ డబ్బుతో రాజధాని నిర్మించి, కష్టాలతో ఉన్న ప్రాంతాలకు తాగు, సాగునీరు ఇవ్వవచ్చు. గోదావరి జలాలను తీసుకువచ్చి బనకచెర్ల రెగ్యులేటర్‌కు నీరు ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. ఇది కదా నాయకుడు ఆలోచన చేయాల్సింది. అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. 
 

తాజా వీడియోలు

Back to Top