తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15న (రేపు) ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు.