ఒడిశా సీఎంకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ

తాడేపల్లి: వంశధార నదిపై నేరడి బ్యారేజ్‌ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు తాము సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సహాయం కోరారు. నేరడి బ్యారేజ్‌ నిర్మాణంతో ఒడిశా రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రైతులకు, ఒడిశాలోని గణపతి జిల్లా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్‌సీల నీటిని నేరడి బ్యారేజ్‌ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చన్నారు. 
 

Back to Top