అప్పుడేమో చేగువేరా... ఇప్పుడేమో చంద్రబాబు 

పవన్ కల్యాణ్ పై చెల్లుబోయిన సెటైర్లు

పవన్ కు ఎంతమంది స్ఫూర్తి అంటూ చెల్లుబోయిన ప్రశ్న

సనాతనధర్మం పేరుతో డ్రామాలాడారని విమర్శ

రాజ‌మండ్రి:  డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ సైట‌రిక‌ల్ కామెంట్స్ చేశారు. గ‌తంలో త‌న‌కు చేగువేరా స్ఫూర్తి అంటూ డైలాగ్‌లు చెప్పిన ప‌వ‌న్‌..ఇప్పుడేమో పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని అంటున్నార‌ని త‌ప్పుప‌ట్టారు.   పవన్ కు ఎంత మంది స్ఫూర్తి? అని ఆయన ప్రశ్నించారు. చేగువేరా తనకు స్ఫూర్తి అని గతంలో పవన్ చెప్పారని... ఇప్పుడేమో చంద్రబాబు తనకు స్ఫూర్తి అంటున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు సనాతనధర్మం పేరుతో డ్రామాలాడారని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై కూడా చెల్లుబోయిన విమర్శలు గుప్పించారు. సొంతవారికి సంపద సృష్టించేందుకే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారని మండిపడ్డారు. మద్యం టెండర్లకు దరఖాస్తు ప్రక్రియను రెండు రోజులు పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజలను తాగుబోతులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top