బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు లేదు

మీడియా స‌మావేశంలో  రాష్ట్ర సమాచార, బీసీ సక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 

కులగణనకు బీజేపీ అనుకూలమా? వ్యతిరేకమా అనేది పురందేశ్వరి చెప్పాలి 

కులాల మధ్య విభేదాలు సృష్టించి..అధికారంలోకి రావాలనేది వారి తపన: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌

ఎన్నికల వేళ చంద్రబాబు మళ్లీ బీసీల భజన చేస్తున్నాడు. 

స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి కారణం చంద్రబాబు కాదా? 

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కేసు వేసిన ప్రతాప్‌రెడ్డి నీ మనిషి కాదా బాబూ? 

కాపులు, శెట్టిబలిజలను కలిపేస్తానన్న పవన్‌...ఒక్క శెట్టిబలిజకు కూడా సీటివ్వలేదేం? 

బాబు..ప్రతిపక్షంలో ఉంటే బీసీ భజన...అధికారంలోకి వస్తే తోకలు కత్తిరిస్తానంటాడు. 

మీరంతా కలిసి బీసీలను ఉద్దరిస్తామంటే నమ్మేవారు లేరు. 

బీసీలను అక్కున చేర్చుకుని వారిని ఉన్నత స్థానానికి తీసుకొస్తున్నది వైయ‌స్‌ జగన్‌ గారే.: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌.

తూర్పుగోదావరి: చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.  నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు. తన అన్న మాటలను మరిచిపోయి ప్రజలు దగ్గరికి వచ్చి సూక్తులు చెబుతున్నాడంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి. ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు ఎలా చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు. చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా?. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా.? 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు..? అంటూ మంత్రి ప్రశ్నించారు.
రాష్ట్ర సమాచార, బీసీ సక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.

స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి కారణం చంద్రబాబు కాదా?:
– ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు వారి మనోభావాలను దెబ్బతీశాడు. 
– తాను అన్న మాటను తానే మరచి ప్రజల వద్దకు వచ్చి సూక్తులు చెప్తున్నాడు. 
– ఒక ఆశయం లేని వ్యక్తికి ఆత్యాశ పెరిగి, తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని ఇతర పార్టీలను కలుపుకుని వస్తున్నాడు. 
– ప్రజలు అధికారం ఇస్తే వారి శ్రేయస్సు కోసం ఆలోచించకుండా చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోయాడు. 
– ఆయన మాట్లాడిన వంద ప్రెస్‌మీట్‌లలో వందా అబద్దాలే ఉంటాయి. 
– నిజం మాట్లాడటం రాని చంద్రబాబుకు నేడు పవన్‌ కల్యాణ్, బీజేపీ కలిసింది. 
– లోకేశ్‌ మాట్లాడితే బీసీల గురించి మాట్లాడుతున్నాడు. సూటిగా అడుగుతున్నాను. 
– ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి కారణం మీరు కాదా చంద్రబాబు? 
– నువ్వు చేసిన తప్పును అధికార పార్టీపైకి నెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నది చంద్రబాబే. 
– 2014 ముందు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి. 2018లో జరగాల్సిన ఎన్నికలు నువ్వు ఎందుకు జరపలేదు? 
– ఆ రోజు ప్రభుత్వం ఒక అఫడవిట్‌ ఇచ్చింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మేం ఎన్నికలకు వెళ్తాం అని మీరు అఫడవిట్‌ ఇవ్వలేదా? 
– జగన్‌ గారు సీఎం అయిన తర్వాత 34 శాతం రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుంటే..ప్రతాప్‌రెడ్డి అనే నీ అనుచరుడిని కోర్టుకు పంపి ఆడ్డుకున్నదెవరు? 
– ఎంత కాలం అబద్ధాలతో ప్రయాణం చేస్తావు..స్పష్టంగా సమాధానం చెప్పు. 

పింఛన్లపై కపట ప్రేమ చూపిస్తున్నాడు..నీ ఐదేళ్లలో పెంచకుండా ఏం చేశావు బాబూ?:
– బీసీలకు పెన్షన్‌ పెంపు అనే మరో పెద్ద అబద్ధం చెప్పాడు. 
– 75 రూపాయలు పెన్షన్‌ చేయడానికి ఖాళీ అయితే కానీ ఇవ్వలేను అని చంద్రబాబు అన్నాడు. 
– నీ జన్మభూమి కమిటీల సమావేశాలకు పెన్షన్‌ దారులను తీసుకొచ్చి నువ్వు రాజకీయ క్రీడ చేశావు. 
– జగన్‌ గారు పింఛన్‌ పెంచుతాను అంటున్నాడని హడావుడిగా ఎన్నికల సమయంలో రెండు నెలలు ముందు 2వేలు ఇచ్చి పెంచాను అంటున్నాడు. 
– ఐదేళ్లు కాలంలో పింఛన్‌ పెంచలేదు..ఇవాళ నేను పెంచాను అంటూ అబద్ధమాడుతున్నాడు. 
– రూ. 2250 నుంచి నేడు రూ.3వేలు పింఛన్‌ పంచుతుంటే..దాని మీద అక్కసు వెళ్లగక్కుతున్నాడు. 
– ఈ రాష్ట్రంలో సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రంలో దివాళ తీసిందని నువ్వు ఎన్ని సార్లు అన్నావో గుర్తు తెచ్చుకో. 
– అలాంటి నువ్వు బీసీలకు న్యాయం చేస్తావా? 
– ప్రజలకు అర్ధం కాదులే అని స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి మాట్లాడతాడు. 
– రాజ్యసభ స్థానాల్లో ఎప్పుడైనా నీ పార్టీ బీసీలకు సీటిచ్చిందా? 
– 9 స్థానాలు వస్తే వాటిలో 4 స్థానాలు బీసీలకు కేటాయించిన నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌. 
– ఆయనతో నువ్వు పోలిక పెట్టుకుంటావా? అబద్ధం మాట్లాడటానికి సిగ్గు అనిపించడం లేదా? 

నీ సోషల్‌ ఇంజినీరింగ్‌ ఎక్కడ పవన్‌ కల్యాణ్‌?:
– కత్తిపూడి నుంచి భీమవరం వరకూ నేను సోషల్‌ ఇంజినీరింగ్‌ చేస్తానంటూ పవన్‌ కల్యాణ్‌ ఫెయిలయ్యాడు. 
– ఆతను ఫెయిల్‌ కావడానికి కూడా చంద్రబాబే కారణం. 
– కాపులు, శెట్టిబలిజలను కలిపేస్తానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ కనీసం శెట్టిబలిజకు ఒక సీటు కూడా కేటాయించలేదు. 
– రెండు సామాజిక వర్గాలను విడదీసి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. 
– చంద్రబాబు ఒక ఎన్నికలో మాల, మాదిగలను విడదీశాడు. మరో ఎన్నికలు కాపులకు, బీసీలకు గొడవలు సృష్టించాడు. 
– కులాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా అధికారంలోకి రావాలనేది మాత్రమే నీ తపన.
– 1994–2004 వరకూ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏ బీసీ విద్యార్థికైనా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చావా? 
– వైఎస్సార్‌ గారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తే దాన్ని సగానికి తగ్గించిన బీసీలకు ఉన్నత విద్యను దూరం చేసింది నువ్వు కాదా? 
– బీసీల ద్రోహి చంద్రబాబు. కనీసం తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి బీసీల గురించి పట్టించుకోలేదు. 
– బీసీలకు నేడు ఇంగ్లీషు మీడియం విద్య ఇస్తానంటే కేసులు వేయించిన చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. 
– బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తోకలు కత్తిరిస్తానన్నది ప్రజలు మర్చిపోలేదు. 
– బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి చంద్రబాబు ఉత్తరం రాసింది ప్రజలు మర్చిపోలేదు. 

నువ్వు ప్రలోభపెడితే బీసీలు నమ్మేస్తారనుకుంటే పొరపాటే:
– బీసీలకు 50 ఏళ్లకు పింఛన్‌ ఇస్తాడట..ఇప్పటికే జగన్‌గారు మత్స్యకారులు, చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తున్నారన్నది మర్చిపోయావా? 
– ఏదో ఒక ప్రలోభపెడితే బీసీలు నమ్మేస్తారని చంద్రబాబు అనుకుంటున్నాడు. 
– నీ అబద్ధాలు సాగవు. బీసీల వ్యతిరేక ఆలోచనలు సాగనివ్వం. 
– 33 శాతం బీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని కేంద్రానికి ఉత్తరం రాస్తాడట. ఇది పెద్ద ట్రాప్‌.
– ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం తర్వాత మాలలు అధికంగా ఉన్నారు. మూడోది శెట్టిబలిజ, మత్స్యకారులు ఉన్నారు.
– ఈ వర్గాలకు కనీస ప్రాతినిధ్యం ఇవ్వని చంద్రబాబు మా వర్గాల కోరికలు ఎలా తీరుస్తాడో చెప్పాలి. 
– మా నాయకుడు జగన్‌ గారు మా జిల్లాలో 6 స్థానాలు బీసీలకు ఇచ్చాడు. రాజ్యసభకు బోస్‌గారిని పంపాడు. 2 మండలి స్థానాలు ఇచ్చారు.
– చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. 

కులగణనపై కపట నాటకాలు ఎందుకు బాబూ?:
– కులగణన ప్రక్రియ గత జ్యోతిరావుపూలే జయంతి నాడు ప్రకటించాం. 
– ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికల ముందు కులగణన చేయడం ఏంటి అని మీరు మాట్లాడారు. 
– పవన్‌ కల్యాణ్‌కు మీరు స్క్రిప్ట్‌ రాసిచ్చి కులగణన ఎన్నికల ముందు ఏంటని మాట్లాడించావు. 
– మళ్లీ దాన్ని మర్చిపోయి ఇప్పుడు కులగణన చేస్తానంటూ ఎన్నికల్లో బూటకపు హామీ ఇస్తున్నాడు. 
– మేం కులగణన పూర్తి చేశాం. కేంద్రానికి పంపించాం. ఎన్నికల కమిషన్‌కు కూడా పంపించాం. 
– 50 శాతానికి మించి ఉన్న బీసీ వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావడం జగన్‌ గారికే సాధ్యం. 
– జగన్‌గారు బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యానికి భయకంపితుడై ఇప్పుడు బీసీల జపం చేస్తున్నాడు. 
– తాను బీసీలకు రూ.5వేల కోట్లు ఖర్చు చేశాను అని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు. 
– బీసీ మంత్రిగా నేను చెప్తున్నా. కేవలం రూ.165 కోట్లతో నాణ్యతాలోపం ఉన్న ఆదరణ పనిముట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 
– బీసీల జీవితాలు మారాలంటే వారికి ఉన్నతమైన విద్య అందాలి. ఆ ప్రక్రియ జగన్‌ గారు చేస్తున్నారు. 
– బీసీలందరూ జగన్‌ గారి పక్షాన ఉన్నారు. వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారు. 
– నేను వస్తే చేస్తానంటావు..అధికారంలోకి వస్తే తోకలు కత్తిరిస్తానంటావు. 
– నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిలో నువ్వు చేసిందేమిటి? 
– కులగణనపై స్పష్టమైన వైఖరి ప్రకటించని పార్టీ బీజేపీ. 
– పురందేశ్వరి మా జెండాలు వేరు కానీ..ఎజెండా మాత్రం ఒకటే అంటున్నారు. 
– కులగణనను బీజేపీ అనుకూలమా? వ్యతిరేకమా అనేది చెప్పాలి. 
– కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన అనేక వినతులను పరిష్కరించని బీజేపీ కులగణనకు అనుకూలం అని మీరెలా చెప్తారు? 
– కులగణన పూరై్తంది..జగన్‌మోహన్‌రెడ్డి గారు బీసీల ఆకాంక్షలను నెరవేర్చడానికి చేసిన ప్రతిఒక్క  ప్రయత్నం సఫలం అయ్యింది. 

గంజాయి, డ్రగ్స్‌ అంటూ...రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు:
– విమర్శించడానికి అవకాశం లేకుండా పరిపాలన సాగినప్పుడు అబద్ధాలతో కూడిన విమర్శలు చేస్తారు. 
– గంజాయి, డ్రగ్స్, బ్లేడు..ఇలా ఏవేవో అంటున్నారు. 
– ఇవి ఈ రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి అనేది మాత్రం వారు గుర్తించడం లేదు. 
– రాష్ట్రంలోని ప్రజలు, యువకుల ఇమేజ్‌ను వారి అసంబద్ధ ఆరోపణలు దెబ్బతీస్తున్నాయి. 
– నేరం జరిగినప్పుడు వేంటనే కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం వల్లే అన్ని కేసులున్నాయి. 
– చంద్రబాబు హయాంలో అయన్నపాత్రుడిపై గంటా శ్రీనివాస్‌ చేసిన కామెంట్లు మర్చిపోయావా? 
– తప్పుడు ఆరోపణలు చేస్తూ విమర్శల్లో చంద్రబాబు చాలా చీఫ్‌గా తయారయ్యాడు. 
– నీ 14 ఏళ్ల పాలనలో నువ్వు ప్రజలకేం చేశావో చెప్పు. నీ నాయకులు ఎలా దోపిడీ చేశారో వివరించు. 
– నేడు లంచాలు లేని సంక్షేమాన్ని అందిస్తున్న జగన్‌ గారికి, చంద్రబాబుకు పోలికా? 
– చంద్రబాబు తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని అత్యాస పడుతున్నాడు. 
– లోకేశ్‌ ఆత్యాశ చంద్రబాబును జైలుకు పంపించింది. 
– చంద్రబాబుకంటూ ప్రత్యేక చట్టాలంటూ ఉన్నాయా? తప్పు చేస్తే జైలు శిక్ష అనుభవించాల్సిందే. 
– ఈ దేశంలో న్యాయం ఆలస్యమవ్వోచ్చు కానీ న్యాయం మాత్రం జరుగుతుంది. 

వృద్ధుల ఆగ్రహానికి చవిచూసేసరికి వాలంటీర్‌ వ్యవస్థ కొనసాగిస్తానంటున్నాడు:
– వాలంటీర్‌ వ్యవస్థను అత్యంత హీనంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. 
– వాలంటీర్లది గోనె సంచులు మోసే ఉద్యోగం అన్నాడు. 
– మగవాళ్లు ఇళ్లలో లేనప్పుడు ఆడవాళ్లను హింసిస్తున్నారన్న చంద్రబాబు ఇప్పుడు పదివేలు జీతం ఇస్తాడట. 
– వాలంటీర్‌ వ్యవస్థ ఉండకూడదు, పింఛన్లు పంచకూడదు అని పిటిషన్‌ వేసిందెవరో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 
– నిమ్మగడ్డ రమేష్‌ ఈయన మనిషే కదా..పిటిషన్‌ వేయించి ఏమీ తెలియనట్లు నటిస్తున్నాడు. 
– ఒక్క రోజులో వృద్ధుల ఆగ్రహానికి గురికావడంతో యూటర్న్‌ తీసుకుని వాలంటీర్లకు పారితోషకం పెంచుతాను అంటున్నాడు. 
– వాళ్లని సంఘ విద్రోహ శక్తులు అన్నాడు. ఇంకో వ్యక్తి వారిని జిహాదీలన్నాడు. 
– అంత దారుణంగా కామెంట్‌ చేసి నేడు వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తాను అంటున్నాడు. 
– చంద్రబాబు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ అనేక సంక్షేమాలను వ్యతిరేకించాడు. 
– అతనికి స్వయంగా ఏదీ ఆలోచన రాదు. వ్యతిరేకించిన ఆయనే ఇప్పుడు ఇంకా అదనంగా ఇస్తానంటాడు. 
– చంద్రబాబు కాపీ మాస్టర్‌..పరీక్షలు చదివి రాసి ఉండడు. 
– వైఎస్సార్సీపీ గెలుపును ఆపే పరిస్థితి ఎవరికీ లేదు. ఈ రోజు అబద్ధం చెప్పి నమ్మించాను అనుకుంటే పొరపాటే. 
– ప్రజలు విజ్ఞలు..నీ అబద్ధాలకు పోలింగ్‌ రోజు సమాధానం చెప్తారు. 

Back to Top