చంద్రబాబుకు శిక్షపడేంత వరుకూ పోరాడతా

వైయస్‌ఆర్‌సీపీ నేత లక్ష్మీపార్వతి

హైదరాబాద్‌:చంద్రబాబు ప్రతి ఎన్నికల అఫిడవిట్‌ల్లో ఆదాయానికి సంబంధించి తేడాలున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు.హైటెక్‌ సిటీలో చంద్రబాబు తల్లికి రూ.50 లక్షల విలువైన భూమి ఉందని..ఆ భూమిని కొని మనవడికి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చూపారని తెలిపారు.చంద్రబాబు తల్లికి కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఉందని, ఆదాయం లేని చంద్రబాబు తల్లికి అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.అప్పట్లో భువనేశ్వరికి ఆదాయమే లేదన్నారు.భువనేశ్వరి కోట్ల విలువైన భూమిని అమ్మినట్లుగా ఆదాయం వచ్చినట్లుగా చంద్రబాబు చూపారని తెలిపారు. 2005లో  చంద్రబాబు అవినీతిపై ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ప్రాథమిక సాక్ష్యాధారాలతో ఉండటం వల్లన  కేసును  ఏసీబీ స్వీకరించిందన్నారు. చంద్రబాబుకు శిక్షపడేంత వరుకు పోరాడతానని తెలిపారు.
 

Back to Top