ఇదిగో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌  

తాడేపల్లి: చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి కాగానే ఫలాని ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందుగానే తన బినామీలు, పార్టీ నేతలకు, మంత్రులకు సమాచారం ఇచ్చారు. రాజధాని ప్రాంతంగా ప్రకటించకముందే అక్కడ భూములు చౌకగా కొనుగోలు చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. టీడీపీ నేతలు తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాణి, తాడేపల్లి, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్‌, చందర్లపాడులో భూలావాదేవిలు జరిపారు.  రాజధాని ప్రాంతాల్లో 2014 నుంచి డిసెంబర్‌ 31 వరకూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది. గుంటూరు జిల్లాలో 2279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు టీడీపీ నేతలు కొనుగోలు చేశారు. 

చంద్రబాబు, ఆయన బినామీలు కొనుగోలు చేసిన భూముల వివరాలు ఇలా..

- జూన్‌ 2014లో 530.69 ఎకరాలు
- జులైలో 685.34 ఎకరాలు
- ఆగస్టులో 353.03 ఎకరాలు
- సెప్టెంబర్‌లో 567.26 ఎకరాలు
- అక్టోబర్‌లో 564.91 ఎకరాలు
- నవంబర్‌లో 836.81 ఎకరాలు
- డిసెంబర్‌లో 531.90 ఎకరాలు
- మొత్తంగా 4069.95 ఎకరాలు 
 
టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు 

- హెరిటేజ్‌(చంద్రబాబు సొంత సంస్థ) కంతేరులో 14.22 ఎకరాలు
- అప్పటి మంత్రి పొంగూరు నారాయణ-55.27 ఎకరాలు
- అప్పటి మంత్రి పత్తిపాటి పుల్లారావు-38.84 ఎకరాలు
- అప్పటి మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి  -7.56 ఎకరాలు
- అప్పటి మంత్రి రావెల కిశోర్‌బాబు-40.85 ఎకరాలు
- టీడీపీ అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ ఐనవోలు వద్ద 15.30 ఎకరాలు
- అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు-53.48 ఎకరాలు
- కొమ్మాలపాటి శ్రీధర్‌- 68.60 ఎకరాలు
- కోడెల శివరామకృష్ణ- 17.13 ఎకరాలు
- ధూలిపాళ్ల నరేంద్ర చౌదరి- 13.50 ఎకరాలు
 

Back to Top