కర్నూలు: కర్నూలు అర్బన్‌లో వైయస్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు, పోలీసుల నోటీసులు కొనసాగుతున్నాయి. కర్నూలు నియోజకవర్గానికి చెందిన 53 మంది వైయస్ఆర్‌సీపీ నేతలపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసి, ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న నేతలు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. 53 మందిలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, సిటీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ తదితర ముఖ్య నేతలు ఉన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీకి సంబంధించి తమపై కేసులు నమోదు చేశారని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం భయంతోనే తమ నేతలపై కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, వాటిపై న్యాయపరంగా పోరాటం చేస్తూనే ప్రజల పక్షాన మరింత బలంగా నిలబడతామని వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ విధానాలు, అక్రమాలపై మరింతగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.