నేడు సీఎం అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ

స‌చివాల‌యం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్‌ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో కేబినెట్‌ భేటీ కానుంది. ఈ క్రమంలో మంత్రి వర్గం కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చ జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు కేబినెట్‌ ఆమోదించనుంది. 

Back to Top