శాప్ చైర్మన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ ఆధారిటీ (శాప్‌) చైర్మన్ గా వైయ‌స్ఆర్ సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. శుక్ర‌వారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో  ఏర్పాటు చేసిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా సాగింది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ..అభినందించారు. 

మాట నిల‌బెట్టుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారటీ చైర్మన్‌ పదవి(శాప్‌)ని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఇచ్చారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌ సీపీ అభ్య‌ర్థి  ప్రచార సభలో సీఎం వైయ‌స్‌ జగన్‌ మాట్లాడుతూ.. బైరెడ్డి  సిద్దార్థ‌రెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అప్ప‌ట్లో  సీఎం వైయ‌స్ జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారు.   తనకు శాప్‌ పదవి రావడంపై బైరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  

Back to Top