బాబూ..మీ మాదిరిగా అబద్ధాలు చెప్పడం చేతకాదు

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. పింఛన్ల పంపిణీపై టీడీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ట్విట్టర్‌ వేదికగా ఖండించారు. మీ మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చేతకాదన్నారు. 
బుగ్గన ట్వీట్‌లో ఈ విధంగా స్పందించారు. చంద్రబాబు గారూ.. ప్రతి నెల మాదిరే ఈ నెల కూడా 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 49,93,689 మందికి (93.5%) పంపిణీ జరిగింది. మీ మాదిరి మాకు అబద్ధాలు చెప్పడం మోసం చేయడం  చేతకాదు. రాష్ట్రంలో భారీ వర్షాలు..వరదలు వచ్చినా పింఛన్ల పంపిణీ శాతం మీ పాలనలో కంటే మెరుగ్గానే చేశామనడానికి గత 7 నెలల పంపిణీ సరళిని చూడండి మీకే తెలుస్తుంది. 1వ తేదీనే మొత్తం పింఛన్లు పంపిణీ పూర్తి చేయడమనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆ విషయం మీకూ తెలుసు.
 

తాజా ఫోటోలు

Back to Top