మా ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి లేదు

చంద్రబాబు దుష్పచారం చేయటం తగదు 

వైద్య సిబ్బందికి పీపీఈలు సరఫరా చేశాం

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

  అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో బుగ్గన శుక్రవారం పర్యటించారు. కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కోవిడ్‌-19 పరికరాలు కొనుగోలు చేయలేదని చంద్రబాబు దుష్పచారం చేయటం తగదన్నారు. హైదరాబాద్‌లో కుర్చుని చంద్రబాబు విమర్శలు చేయటం దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. సీఎం వైయస్‌ జగన్‌ చేసే ప్రతి పనిని బాబు విమర్శించినడం సరికాదన్నారు.  కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.  రోగులకు చికిత్స అందించే సమయంలో వైద్య సిబ్బందికి కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇందుకోసం వైద్య సిబ్బందికి పీపీఈలు సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు.  కరోనా నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని బుగ్గన పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top