పొలిటికల్ ప్యాకేజీ ప్రొఫిషనల్ పవన్ కల్యాణ్!

మీడియా స‌మావేశంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్  

రాజకీయ పార్టీ పెట్టి డబ్బులు సంపాదించడం పవన్ కు బాగా తెలుసు

పార్టీని టీడీపీలో కలిపేయడం కంటే.. ప్రతి ఎన్నికల్లో ప్యాకేజీనే బెటర్ అన్నది పవన్ పాలసీ.

తల్లిని తిట్టిన వ్యక్తులతో అంటకాగుతున్న పవన్.

రంగాను హతమార్చిన చంద్రబాబుతో పవన్‌ స్నేహమా?

ఆకురౌడీ స్థాయికి దిగజారిన పవన్ కల్యాణ్

పవన్ కు పిచ్చి ముదిరింది.. చిరంజీవి అయినా ఆసుపత్రిలో చూపించాలి.

భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌

భీమ‌వ‌రం:  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పొలిటికల్ ప్యాకేజీ ప్రొఫిషనల్ అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్  విమ‌ర్శించారు. ప‌వ‌న్‌కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. పవన్‌ వాడుతున్న భాష, రెచ్చిపోవడం పిచ్చికి సంబంధించిన లక్షణమని ఎద్దేవా చేశారు. భీమవరం సభలో పవన్‌ వ్యాఖ్యలకు సోమవారం మీడియా స‌మావేశంలో గ్రంధి కౌంటర్‌ ఇచ్చారు.  

 ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఏం మాట్లాడారంటే..:

పవన్ కు పిచ్చి బాగా ముదిరింది-ఆసుపత్రిలో చూపించండి

  • జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. పవన్‌ వాడుతున్న భాష, ఊగిపోవడం, రెచ్చిపోవడం పిచ్చికి సంబంధించిన లక్షణమని ఎద్దేవా చేశారు. భీమవరం సభలో పవన్‌ వ్యాఖ్యలకు గ్రంధి శ్రీనివాస్‌ చురకలు అంటించారు. పవన్‌ కల్యాణ్‌ ఒక రౌడీలా మాట్లాడుతున్నాడు. ఆయన మానసిక స్థితి బాగోలేదు. పిచ్చి ముదిరిన వ్యక్తిని వైద్యులకు చూపించారో, లేదో తెలియదు. వాళ్ల అన్న చిరంజీవి కూడా తమ్ముడి పక్షాన నిలబడతాను అని ఇటీవల అన్నారు. పవన్‌ కల్యాణ్‌కు రాజకీయాల్లో చిరంజీవి మద్దతు తెలపటం కాదు. చిరంజీవి,  ముందుగా పవన్‌ కల్యాణ్‌ను ఆసుపత్రిలో చూపించాలి. కొంత కాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే, చాలా బావుంటుందని చిరంజీవికి సూచన చేస్తున్నాను.  పవన్‌కు రాజకీయాల విలువలు లేవు. ఊసరవెల్లిలాగా పవన్‌ ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. గతంలో తనను తిట్టిన వ్యక్తికే పవన్‌ కల్యాణ్‌ భీమవరం టికెట్‌ ఇచ్చారని గ్రంధి శ్రీనివాస్ అన్నాడు. 

ఆకురౌడీ స్థాయికి దిగజారిన పవన్ కల్యాణ్

  • సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి గురించి.. బ్లేడ్ బ్యాచ్, కడప బాంబులు అని మాట్లాడటం ఏమిటి? నన్ను రౌడీగా పోలుస్తూ.. ఏ సెంటర్‌కు వస్తావో రా .. అని సవాల్ చేయటం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. మేమంతా మామూలుగా బాగానే ఉన్నాం. కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా? బ్లేడ్ బ్యాచ్‌ తెచ్చుకుంటావా? సీఎం జగన్ రౌడీ, నేను రౌడీ అని మాట్లాడటం చూసిన తరువాత ప్రజలకు ఎవరు రౌడీనో అర్థమౌతోంది. రౌడీ భాష మాట్లాడుతోంది పవన్ కల్యాణ్‌. దమ్ముంటే ఏ సెంటర్‌ వస్తావో రా అనటం ఏమిటి? ఒక ఆకు రౌడీ స్థాయికి దిగజారిపోయి ఎదుటి వారిని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనటం చూస్తే నిజంగా విచారం కలుగుతోంది. అదే సమయంలో భయం కూడా కలుగుతోంది. మనిషికి ఏదైనా పిచ్చి పడితే దానివల్ల కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికే ఇబ్బంది ఉంటుంది. కానీ, కుక్కకు పిచ్చి పడితే అది కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి. పత్యం చేయాలి. మనిషి స్థాయి నుంచి ఏస్థాయికి పవన్ వెళ్లిపోయాడో ఆయన భాష చూస్తుంటే నా నోటితో అనలేక పోతున్నా. సమాజంలో బాగా పిచ్చి ముదిరినట్లు చేస్తే.. వీడిని ఏమైనా పిచ్చి కుక్క కరిచిందా అంటారు. లేదా పిచ్చి కుక్కలా మీద పడిపోతున్నారు ఏంట్రా అంటాం.
  • రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడుతున్నానని గొప్పగా చెప్పే ఇతను ఎలాంటి వ్యక్తో ఇదొక ఉదాహరణ చాలు. విలువలు లేవు. ఇప్పుడు మాట్లాడింది ఒక గంట తరువాత మాటలు మారుస్తాడు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఎప్పుడు ఏది మాట్లాడతాడో తెలియదు. భీమవరం గురించి ఏమి తెలుసు. భీమవరంలో కంపోస్టు యార్డు ఏర్పాటు కోసం రైతులకు డబ్బులు చెల్లించి 6.60 ఎకరాల భూమి సేకరించాం. ఈ విషయం ప్రజలకు కూడా అనేకసార్లు చెప్పాం. ఈ స్ర్కిప్ట్ పవన్ కల్యాణ్‌కు ఎవరు రాసిచ్చారో. పవన్ అజ్ఞానంతోనో? పిచ్చితోనో మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. ఈ పిచ్చి ముదిరి సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని కోరుకుంటున్నా. పవన్ కల్యాణ్‌ మానసిక ఆరోగ్యంపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేశాం.

తన సినిమా ప్రమోషన్ కోసమే పవన్‌కు చిరంజీవి మద్దతిస్తున్నారు

  • చిరంజీవి తన సినిమాలు ఆడటం కోసం.. సినిమా పరిశ్రమపై సీఎం జగన్‌ గారిని కలసి నమస్కరించి రిక్వెస్ట్ చేశారు. దాన్ని సహించలేని పవన్ కల్యాణ్‌ ఆ సినిమాను బాయ్‌కాట్ చేయమన్నారు. ఆ సినిమాకు ఓపెనింగ్స్ లేవు. దీంతో పవన్ కల్యాణ్‌ అభిమానులు వస్తే తప్ప కలెక్షన్లు రావని చిరంజీవి పవన్ కల్యాణ్‌ను పొగడటం చేశారు. నాలుగైదు నెలల్లో కొత్త సినిమా రిలీజ్ అవుతుందని పవన్ కల్యాణ్‌ను కాకా పట్టాలని రూ.ఐదు కోట్లు పార్టీ ఫండ్‌ కూడా ఇవ్వటం జరిగింది. ఇదీ వీళ్ల మనస్తత్వాలు. పైసా కోసం ఏమైనా చేస్తారు వీళ్లు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచిన తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు. హోల్‌సేల్‌గా అమ్మేసి కేంద్రమంత్రి పదవి తీసుకున్నారు. ఎంతో ఆశతో ప్రజారాజ్యంలో చేరిన వాళ్లు అన్యాయం అయిపోయారు.

టీడీపీతో ఉంటే ప్రతి ఎన్నికలకు పవన్ కు ప్యాకేజీ.. 

  • "పవన్ కల్యాణ్ ఏమో పదేళ్లుగా పార్టీని నడుపుతున్నాను. రోడ్ల మీద యుద్ధం చేస్తున్నా"అని అన్నాడు. పవన్ కల్యాణ్ అసలు యుద్ధం ఎప్పుడు చేశాడు?. సినిమా షూటింగ్‌లు చేసుకుంటూ, డబ్బులు సంపాదించుకున్నాడు. కోవిడ్ వచ్చినప్పుడు ఎవరికైనా కనిపించాడా? ఎవరికైనా సాయం చేశాడా? ప్రజాక్షేత్రంలో ఉన్నానని అంటాడు. ఒకసారి కారు డిక్కీలో పడుకుని టీ తాగుతూ ఫొటో ఇస్తాడు. ఒకసారి ఆవులకు అరటిపండ్లు తినిపిస్తూ వీడియో రిలీజ్ చేస్తాడు. ఇదా ప్రజాక్షేత్రంలో ఉండటం అంటే. ప్రజల కోసం పోరాడటం అంటే. ఒకసారి ఏమో.. పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు మోదీ అని ఉద్రేకంతో అరుస్తాడు. అదే మోదీతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయిస్తాను అంటాడు. రాజకీయంలో ఇంత దగుల్బాజీని అసలు చూడలేదు. చిరంజీవిలా.. పవన్‌ కల్యాణ్‌ కూడా పార్టీని టీడీపీలో కలిపేసి మాట్లాడితే సరిపోతుంది. కలిపేస్తే ఒక్కసారే ప్యాకేజీ వస్తుంది. పార్టీ ఉంచుకుని ఎలక్షన్ ఎలక్షన్‌కు ప్యాకేజీ తీసుకోవచ్చని భావించే ఒక ప్యాకేజీ ప్రొఫెషనల్ పవన్ కల్యాణ్. పార్టీ పెట్టి ఎలా డబ్బులు సంపాదించాలో తెలిసిన వ్యక్తి. పవన్ తత్వం తెల్సి పార్టీ నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోయారు. పోతిన మహేశ్‌తో పాటు చాలా మంది నియోజకవర్గ ఇంఛార్జ్‌లు జనసేనకు రాజీనామా చేసి వైఎస్ఆర్‌సీపీలో చేరారు.
  • పవన్ మాట్లాడితే అర్బన్ బ్యాంకు అని విమర్శలు చేస్తున్నారు. 2019లో ప్రతి ఒక్కటీ ప్రజలకు వివరించటం జరిగింది. వాస్తవాలు ప్రజలు గ్రహించారు. నేను ఏ తప్పూ చేయలేదని పవన్ చేసిన ఆరోపణలు అన్నీ అసత్యాలని 2019 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. అది కూడా గ్రహించలేని అజ్ఞాని పవన్ కల్యాణ్‌. జనసేన అభ్యర్థి పదిహేనేళ్లలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పమనండి. నేను చేసిన అభివృద్ధి అంతా పాంప్లేట్ వేసి ప్రజల వద్దకు పంపించటం జరుగుతోంది. భీమవరం నియోజకవర్గం అభివృద్ధి 2019-24లోనే జరిగింది..

రంగాను హతమార్చిన చంద్రబాబుతో పవన్‌ స్నేహమా?

  • పవన్ కల్యాణ్‌ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ మీటింగ్‌కు ముందు రెండు నెలల క్రితం భీమవరం పవన్ కల్యాణ్‌ వచ్చాడు. గ్రంధి శ్రీనివాస్ అంటే ద్వేషం లేదని పవన్ కల్యాణే చెప్పాడు. మళ్లీ ఇవాళ రౌడీ, గూండా, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అని మాట్లాడుతున్నాడు. దీనిబట్టి పవన్ కల్యాణ్‌ మానసిక స్థితి అర్థమౌతోంది. పవన్ శ్రేయోభిలాషులు ఎవరైనా విశాఖ పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి చూపించాలి. మరో 20 ఏళ్లు పార్టీని నడపాలంటే మానసిక ఆరోగ్యం కుదట పడాలి. సాటి మనిషిగా సానుభూతితో సలహా ఇస్తున్నాను. గూండానో, రౌడీనో అయితే ఇలాంటి సలహాను ఇవ్వను. వంగవీటి మోహన రంగాను అంతమొందించిన చంద్రబాబు లాంటి గూండా, హంతకుడు దగ్గర పవన్ కల్యాణ్‌ ఉన్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్‌ చావుకు కారకులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిందెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలిసిన విషయాలు పవన్‌ తనకు తెలియనట్లు ఉంటాడు. ప్రజలకు తెలిసిన విషయాలు అసత్యాలుగా పవన్ ప్రచారం చేస్తాడు.
  • చేగువేరా, అంబేద్కర్, మదర్ థెరిస్సా, పూలే ఫొటోలతో కొన్ని వర్గాలను మోసం చేశావు. తరువాత ఫొటోలు తీసేసి .. కమర్షియల్ రూపాన్ని బయటపెట్టావు. తల్లిని దూషించాడని లోకేశ్‌, చంద్రబాబును, ఎల్లో మీడియాను తిట్టిన పవన్‌ కల్యాణ్‌ ... నేడు వారితోనే అంటకాగుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని సిగ్గుశరం లేని మనిషి అంటారు.

మొదటి పెళ్ళితో అన్యాయం జరిగింది కాపు యువతికే..

  • రాజకీయ నేత అంటే కొన్ని విలువలు, సిద్ధాంతాలు, మంచి లక్షణాలు ఉండాలి. నాలుగేళ్లకోసారి కార్లు మారుస్తున్నట్లు భార్యలను పవన్ మారుస్తున్నాడని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అది నిజమే కదా. మన సంస్కృతి ఏమిటి? జీవితాంతం ఒక అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడతామని వివాహంలో ప్రతిజ్ఞ చేస్తాం. అదీ మన సాంప్రదాయ వివాహ వ్యవస్థ. దాన్ని అవహేళన చేస్తూ ఎలాంటి సందేశం ఇస్తున్నావు పవన్. నాలుగేళ్లకోసారి అమ్మాయి గొంతు కోస్తున్నావని అంటే తట్టుకోలేక ఇష్టమొచ్చినట్లు పవన్ కల్యాణ్‌ మాట్లాడటం ఏమిటి? పవన్ కల్యాణ్‌ మొదటి భార్య కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. మన కుటుంబంలో అమ్మాయికే అలా అన్యాయం జరిగితే సహిస్తారా? రెండోసారి రాష్ట్ర పరిధి దాటి వేరే రాష్ట్ర అమ్మాయిని చేసుకున్నాడు. ఆమెకు కూడా అన్యాయం చేశాడు. తరువాత రాష్ట్రాలు, దేశాలు దాటి ఖండాలు దాటిపోయాడు. ఖండాతరాల్లో అమ్మాయిని చేసుకున్నాడు. దేశంలో అమ్మాయిలు ఎవ్వరూ అర్హులైన వారు కాదన్నమాట. పవన్ లక్షణాలకు, ఆదర్శభావాలకు సరిపడే అమ్మాయి దేశంలోనే లేరన్నమాట. దేశ వివాహ వ్యవస్థను, భారతీయ మహిళలను అపహాస్యం చేస్తున్నాడని రాజకీయాలలో ఉన్నవారు ఆదర్శంగా ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబితే పిచ్చి కుక్కలా పవన్ కల్యాణ్ రెచ్చిపోతున్నాడు.

పిచ్చి వారి గురించి మాట్లాడటం వేస్ట్‌
పిచ్చితో రెచ్చిపోయే కుక్కనుగానీ, మనిషినిగానీ ఏం చేస్తారు. పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడటం, ప్రతిస్పందించటం కూడా వేస్ట్. రౌడీబ్యాచ్, బ్లేడ్‌ బ్యాచ్, కడప బాంబులు మా దగ్గర లేవు. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు, లోకేశ్‌ ఉన్నారు. వాళ్లు రెడ్ బుక్ రాసుకున్నారట. హిట్ లిస్టు రాసుకున్నారట. భౌతికంగా లేపేస్తామని అంటున్నారు. చిరంజీవికి ఓ నమస్కారం. పవన్ కల్యాణ్‌కు ఐదు కోట్ల విరాళం ఇవ్వటం కాదు. ముందు తమ్ముడు పవన్ ఆరోగ్యం కోసం మంచి వైద్యం అందించి బాగు చేయించండి. దానికోసమైనా చిరంజీవి సినిమాను పవన్ కల్యాణ్‌ అభిమానులు చూస్తారు.

Back to Top